PM Modi : కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం ప్రవేశపట్టిన చట్టాలు రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలునిచ్చారు. దాదాపుగా 40 రైతు సంఘాలతో ఏడాది పాటు వందలాది మంది రైతులు ఉద్యమించారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రైతుల అలుపెరగని ఉద్యమానికి ఎట్టకేలకు కేంద్రం మెట్టు దిగొచ్చింది. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుని చట్టసభల్లో ప్రవేశపెట్టి బిల్ ని రద్దు చేసింది. అయితే ఇదంతా గతం. కానీ ఈ సమయంలో రైతు సంఘాల నాయకుడు రాకేష్ టికాయత్ Rakesh Tikait ఓ ప్రకటన చేశారు. టికాయత్ చేసిన ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నది.
ప్రధాన మంత్రి మోడీ PM Modi కి విదేశాల్లో ఎంతో గౌరవం, పరువు ప్రతిష్టలు ఉన్నాయి. అయితే ఆయనకున్న పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించడం తమకు ఇష్టం లేదని, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ నుంచి రైతులు క్షమాపణలు కూడా కోరుకోవట్లేదని రాకేష్ టికాయత్ ట్వీట్ చేశారు. కాగా.. సాగు చట్టాలను మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకున్న కొన్ని రోజుల తర్వాత టికాయిత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. BKU leader Rakesh Tikait
మరో విశేషం ఏంటంటే మూడు సాగు చట్టాలను మళ్ళీ అమలు చేస్తామంటూ ఇటీవల మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ Tomar షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలకు పాల్పడ్డాయి. కాగా.. తాజాగా అయన తన వ్యాఖ్యలపై యూ టర్న్ తీసుకున్నట్టు తెలుస్తుంది. వ్యవసాయ చట్టాలను మళ్ళీ తీసుకొచ్చే ఆలోచన లేదని, అదంతా విపక్షాలు చేస్తున్న కుట్రేనంటూ తోమర్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడ్డట్టు అయింది. Three Farm Laws