Sunflower Oil Prices Decrease సామాన్యులకు వంట నూనె కష్టాలు తప్పనున్నాయి. కరోనా కలకలం నేపథ్యంలో దేశంలో అన్ని వస్తువులపై ధరలు ఆకాశాన్నంటాయి. కాగా కేంద్ర ప్రభుత్వం జోక్యంతో మెల్లిమెల్లిగా నిత్యావసర వస్తువులపై ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పరంగా పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ దిగుమతి సుంకాలు తగ్గించడమే నూనె ధరలు తగ్గేందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. వివరాలలోకి వెళితే.. Sunflower Oil Prices
Centre cuts basic duties on edible oil గతంలో అందరికీ అందుబాటులో ఉండే నూనె ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకడంతో సామాన్యుడిపై తీవ్రం ప్రభావం చూపింది. ఈ మేరకు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సన్ ఫ్లవర్ ఆయిల్ Sunflower Oil ధరలను తగ్గిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. మోడీ సర్కారు దిగుమతి సుంకాలను తగ్గించడం మూలాన లీటరు ఫ్రీడమ్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ అయిల్‌ను గరిష్టంగా రూ.140లు, అంతకంటే తక్కువ ధరకే విక్రయిస్తున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర రెడ్డి ఓప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ కారణాలతో ఈ ఏడాది ప్రారంభంలో లీటరు వంట నూనె ధర దాదాపు రూ.180 స్థాయికి చేరింది. దాంతో సామాన్యుడు తీవ్రం ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఓ వైపు డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు పెరగడం, దానికి తోడు వంట నూనె కూడా అందుబాటు ధరల్లో లేకపోవడంతో ఇది సామాన్యుడికి పెద్ద సమస్యగా మారింది. ఈ మేరకు కేంద్రం ధరల అదుపు చర్యల్లో భాగంగా సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాలు తగ్గిస్తూ వచ్చింది. దీంతో మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు దిగివచ్చాయి. edible oil