How to Get Rid of Fruit Flies పండ్లు, కూరగాయల పై పండు ఈగ దాడి భీభత్సం సృష్టిస్తుంది. పండు ఈగ మామిడి, జమ, నిమ్మ, రేగు మరియు ఇతర కూరగాయ పంటలపై ప్రభావం చూపిస్తుంది. పక్వానికి వచ్చిన దశలో పండ్లపై పండు ఈగ దాడి చేస్తుంది. ఈగ కాటేసిన కాయపై ఆ గాటు దగ్గర నుంచి వృత్తాకారంలో కొద్ది రోజుల్లో కుళ్లిపోతుంది. దీంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికందివచ్చిన పంటను పండు ఈగ ధ్వసం చేస్తుండటంతో కొందరు రైతులు వివిధ రకాల పద్దతులను పాటిస్తూ ఈ మహమ్మారి పండు ఈగకు చెక్ పెడుతున్నారు. Fruit Flies On Fruits
పండు ఈగలు ఏప్రిల్, మే నెలలో దాడులు చేస్తాయి. ఇవి పూర్తిగా పండిన, లేదా సగం పండిన పండ్లపై దాడి చేస్తాయి. ఈ క్రమంలో కొన్ని రకాల పద్దతులను పాటిస్తే పండు ఈగ సమస్య నుంచి బయట పడవచ్చు. ముందుగా వాడేసిన వాటర్ బాటిల్ ని తీసుకుని హెచ్ ఆకారంలో నాలుగు వైపుల రంధ్రాలు చేయాలి. అడ్డంగా ఒక రంధ్రం కూడా చేయాల్సి ఉంటుంది. పండు ఈగ బాగా ఆకర్షించే పసుపు, నీలం రంగులతో నాలుగు రంధ్రాలకు రంగులు వేయాలి. మరీ ముఖ్యంగా బెల్లం పట్టించిన అరటి తొక్కను బాటిల్ లోపల కింద భాగాన పెట్టాలి. దీంతో పండు ఈగలు ఆ వాసనని పసిగట్టి మధ్యలో ఉన్న రంధ్రం గుండా లోపలి వస్తాయి. దీంతో బాటిల్‌పై పసుపు, నీలం రంగులకు పండు ఈగలు ఆకర్షితమై నశిస్తున్నాయని, ఇది చాలా సులభమైన, ఖర్చులేని మార్గమని నిపుణులు చెప్తున్నారు. ఇలా చేయడం ద్వారా పండు ఈగల భారీ నుండి పంటలను కాపాడవచ్చు. Fruit Flies