Written guarantee on monsoon crop తెలంగాణ ధాన్యం కొనుగోలు ప్రక్రియపై కేంద్రం స్పష్టత లేని హామీలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. వానాకాలం పంట కొనుగోలుపై రాతపూర్వక హామీ మేరకు ఢిల్లీ పర్యటన చేపట్టారు తెలంగాణ మంత్రులు, ఎంపీలు. ఈ మేరకు మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… రైతు ప్రయోజనాల కోసం ఢిల్లీకి వస్తే.. పని లేక వచ్చామని అవమానిస్తారా అంటూ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. వానాకాలం పంట సేకరణపై రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తామని నమ్మబలికి ఇప్పటివరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అందుబాటులో లేరని మండి పడ్డారు. యాసంగి పంట కొనుగోలుపై ఎలాగూ చేతులెత్తేశారు, వానాకాలం పంటనైనా కొంటామని రాతపూర్వక హామీ ఇవ్వడానికి కూడా కేంద్రం ముందుకు రావట్లేదు. కార్పొరేట్ల పనుల కోసం పరుగెత్తే కేంద్రం రైతుల కోసం స్పందించకపోవడం బాధాకరమన్నారు మంత్రి.
మాయమాటలు చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు. పంటకు పూర్తి మద్దతు ధర ఇస్తామని రైతుల్ని ఓట్లు అడిగిన కేంద్రం మాట మార్చి పబ్బం గడుపుతుంది. దేశవ్యాప్తంగా 50 రకాల పంటలు పాడిస్తుంటే కేంద్రం కేవలం 25 రకాల పంటలకు మద్దతు ధర కేటాయిస్తుంది, అది కూడా నామమాత్రంగానే అంటూ ధ్వజమెత్తారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఎమ్మెస్పీపై స్వామినాథన్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ మాటల గారడీతో ఓట్లడిగిన బీజేపీ ఇప్పుడేమో కార్పొరేట్ల కోసం పని చేస్తూ రైతుల్ని తీవ్రంగా నష్టపరుస్తుందన్నారు. Written guarantee on monsoon crop
వ్యవసాయాన్ని బంద్ చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టుంది. వ్యవసాయంపై తెలంగాణ ప్రభుత్వం ఎనలేని కార్యక్రమాలను ప్రవేశపెడుతుంటే కేంద్రం మాత్రం ఏకంగా వ్యవసాయాన్ని నాశనం చేసే దిశగా ప్రయత్నిస్తుందన్నారు. తెలంగాణంలో తాతల కాలం నుండి వడ్లు ప్రధాన పంట. ఈ నేపథ్యంలో వడ్లు కొనమంటే రైతుల పరిస్థితి ఏంటి?. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి సమస్యతో గోస పడిన రైతులకు ఇప్పుడు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. కానీ వడ్లు వేయొద్దని కేంద్రం కొర్రీలు పెడుతుందంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి నిరంజన్ రెడ్డి. నెర్రెలు బారిన నేలకు కాళేశ్వరం ద్వారా గంగమ్మను ఉరుకులు పెట్టించారు సీఎం కెసిఆర్. తెలంగాణాలో రైతుల బాగు కోసం పాటు పడుతున్న తెరాస అభివృద్ధిని ఓర్వలేకే కేంద్రం వడ్లు కొనకుండా తిప్పలు పెడుతుందన్నారు. రైతును బాధ పెట్టిన పార్టీలు చరిత్రలో కలిసిపోయాయి. సరైన సమయంలో బీజేపీకి కూడా కాలమే బుద్ధి చెప్తుందని అన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. Telangana Monsoon Crop