వార్తలు

రైతుల కోసం మొబైల్ యాప్స్

0
Agriculture Apps

Best Mobile Apps For Agriculture దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ఆసరాగా నిలవాల్సిన బాధ్యత మనందరిది. ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టం జరిగితే ఆ రైతుల్ని ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రైతుల్ని సాంకేతికతకు దగ్గర చేసి ఈజీ వ్యవసాయంపై అవగాహన కల్పించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం చేస్తున్నారు నేటి యువత. అందులో భాగంగా రైతుల కోసం పలు యాప్ లు సృష్టించి వారికి అర్ధమయ్యే విధంగా డవలప్ చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వ్యవసాయాన్ని సులభతరం చేసుకోవడం వల్ల శ్రమ, సమయం, పెట్టుబడి కలిసి వస్తాయంటున్నారు టెక్ దిగ్గజాలు. Agriculture Apps

Agriculture Apps

మొబైల్ యాప్ ల ద్వారా ఎప్పుడు ఏ పంట వేయాలి, నూతన పద్ధతులు, సాగు విధానం, ఎరువులు, పురుగు మందులు తదితర విషయాలపై పూర్తి సమాచారాన్ని యాప్ ల ద్వారా రైతులకు అందిస్తున్నారు. ఇక ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. నేటి కాలంలో, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ లభ్యత గ్రామీణ స్థాయికి చేరింది. అలాంటి పరిస్థితిలో, రైతులు వ్యవసాయాన్ని సరళంగా, యాప్ సహాయంతో అందుబాటులో ఉంచడంతో పాటు తమ ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చనే దృఢసంకల్పంతో రైతుల కోసం యాప్ లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి రైతులకు ఉపయుక్తమైన పలు కీలక యాప్‌ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. Best Mobile Apps For Farmers

Agriculture Apps

కిసాన్ సువిధ యాప్.. kisan suvidha app
ఈ యాప్ ద్వారా రైతుకు సంబంధిన వ్యవసాయ సంబంధిత సమాచారం, వాతావరణం, మార్కెట్ ధర, పంట సంరక్షణ, సలహాలు, సూచనలు పొందవచ్చు. అదేవిధంగా నిపుణులతో నేరుగా సంప్రదింపులు జరిపే అవకాశం కల్పిస్తుంది ఈ యాప్.

మేఘదూత్ మొబైల్ యాప్ ..  Meghdoot

ఈ యాప్ ద్వారా పశువుల సంరక్షణ, వెదర్ ఆధారిత అంశాలు, పంట సంరక్షణ లాంటి సలహాలపై సమాచారం అందిస్తుంది. ఈ యాప్ ని భారత వాతావరణ శాఖ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంయుక్తంగా రూపొందించాయి.కాగా.. ఈ యాప్‌లోని సమాచారం వారానికి రెండుసార్లు అంటే మంగళవారం, శుక్రవారం అప్‌డేట్ చేయబడుతుంది. ఇకపోతే ఈ యాప్ వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా వ్యవసాయ సలహాలను పంచుకోవడానికి రైతులకు సహాయపడుతుంది.

Agriculture Apps

అరటి పంట వేసే రైతుల కోసం అందుబాటులో ఉన్న యాప్ పేరు బనానా ప్రొడక్షన్ టెక్నాలజీ. ఈ యాప్ అన్ని భాషల్లో రూపొందించబడింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ యాప్ ని సంయుక్తంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ బనానా రీసెర్చ్, సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, హైదరాబాద్‌తో కలిసి అరటి రైతుల కోసం ఒక యాప్‌ను అభివృద్ధి చేశారు. ఇక ఈ యాప్ ద్వారా వెదర్, నేల, మొక్కలు, నీటి నిర్వహణ, పోషక నిర్వహణ, ఎరువుల సర్దుబాటు లాంటి అంశాలపై సమగ్ర సమాచారం అందిస్తుంది. Agriculture Apps

Leave Your Comments

బాయిల్డ్‌ రైస్ ఇవ్వమని కేసీఆర్ సంతకం చేశారు: కేంద్ర మంత్రి గోయల్

Previous article

రైతులకు గోయల్ క్షమాపణ చెప్పాలి : మంత్రి హరీష్

Next article

You may also like