చీడపీడల యాజమాన్యం

ఖమ్మం మిర్చి రైతుకు తీరని నష్టం

1
Khammam Mirchi Farmers
  • మిర్చి రైతన్న కుటుంబంలో కలవరం

  • 90 శాతానికి పైగా నాశనమైన మిర్చి పంట

  • ఖమ్మం మిర్చి రైతులకు తెగుళ్ల బెడద

  • పంట చేతికి రాకపోవడంతో ఆత్మహత్యలు

Khammam Mirchi Farmers

Khammam Mirchi Farmers ఈ ఏడాది మిర్చి పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు సగం పంటను మింగేస్తే.. తెగుళ్లు సోకి రైతన్నకు తీరని విషాదం మిగిల్చింది. ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చే సమయానికి పంట నాశనమవ్వడంతో రైతులకు కన్నీరే మిగిలింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మిర్చి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. తామర పురుగు, రసం పీల్చే పురుగు, ఎండు తెగులు, కాయ కుళ్లు తెగులు, ఆకుమచ్చ తెగులు కారణంగా వేలాది ఎకరాల్లో మిర్చి తోటలు నాశనమయ్యాయి. ఖమ్మంలోనే దాదాపుగా 90 ఎకరాల్లో మిర్చి నాశనమైంది అంటే మిర్చి రైతన్న పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి, వేల రూపాయలతో తెగుళ్ల మందులు కొట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని రైతన్నలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. Khammam Mirchi Farmers

Khammam Mirchi Farmers

వేల ఎకరాల్లో మిర్చి నాశనమవ్వగా.. ఇక మిగిలిన పంటను రైతన్నలు పీకేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 3,58,557 ఎకరాల్లో రైతులు మిర్చి వేశారు. ఇందులో ఒక్క ఖమ్మం జిల్లాలోనే 40 వేల మంది రైతులు 1,03,021 ఎకరాల్లో తోటలు పోశారు. అయితే వీటిలో దాదాపు 90 శాతం ఎకరాలకు తెగుళ్లు సోకాయని రైతులు చెప్తున్నారు. మిర్చి పంట తీవ్రంగా దెబ్బతినడంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులను ఎట్ల తీర్చుడని ఒక్క నెలలోనే నలుగురు మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఇద్దరు కౌలు రైతులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, మిర్చి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. పంటకు నష్ట పరిహారం ప్రకటించి.. ఉచితంగా ఎరువులు, పురుగుల మందులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. Telangana Mirchi Farmers 

Leave Your Comments

మెంతి సాగుతో రైతులకు ఆదాయం

Previous article

హిమాచల్ ప్రదేశ్‌లో 21 కోట్లు పైగా ఖరీదు చేసే దున్నపోతు

Next article

You may also like