మన వ్యవసాయంవ్యవసాయ వాణిజ్యం

ఆంధ్రా అరటికి విదేశాల్లో పెరుగుతోన్న డిమాండ్​…

0
andhra-pradesh-government-planning-to-export-bananas-to-european-countries-from-this-year

Andhra Banana ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం ఎన్నో పూరతాయన ఆలయాలు, చారిత్రక కట్టాడాలతో పాటు సమృద్ధితో నిండిన పాడిపంటలకూ పెట్టిన పేరు. ఇక్కడ పండే పంటలకు విదేశాల్లో మంచి గిరాకి ఉంది. ముఖ్యంగా మిరప, పసుపు, మిల్లెట్స్ వంటి వాటిని అధికంగా ఇక్కడ నుంచే విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇక సీజన్​లో పండించే మొక్కజొన్న, మామిడి వంటి వాటిని కూడా రైతులు తరచూ ఇతర దేశాలకు తరలిస్తుంటారు.  ఇప్పుడు వీటి స్థానంలో అరటి పండ్లు కూడా చేరిపోయాయి.

andhra-pradesh-government-planning-to-export-bananas-to-european-countries-from-this-year

దేశంలో ఎక్కడాలేనంత అధిక సాగుతో అత్యధిక దిగుబడి కలిగిన అరటి పంటలో ఏపీ తొలిస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ పండే అరటికి మంచి రుచి, క్వాలిటీ ఉన్న క్రమంలోనే విదేశాల్లో వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా యూరప్​, లండన్​ దేశాలకు ఈ పండ్లను అధికంగా ఎగుమతి చేస్తుంటారు. రాష్ట్రంలో సుమారు 1.08 లక్షల హెక్టార్లలో అరటి సాగు చేయగా.. మొత్తం 64.84 లక్షల టన్నుల వరకు పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా.

అరటీలో ప్రధానంగా చక్కెరకేళీ, ఎర్ర చక్కెరకేళీ, కర్పూర, గ్రాండ్-9, అమృతపాణీ, తేళ్ల చక్కేరకేళీ, బూడిద చక్కెర కేళీ, రస్తోలీ, సుగంధ వంటి రకాలను సాగు చేస్తుంటారు. అనంతపురం, కృష్ణా, కడప, ఉభయగోదావరి జిల్లాల్లో ఈ పంటను పండిస్తుంటారు. నిజానికి అరటిలో ఇన్ని రకాలున్నా.. గ్రాండ్​-9కి ఉన్న గిరాకీ ఎక్కడా లేదు. దీని రుచితో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉండే సామర్థ్యం కలిగినందు వల్ల విదేశాల నుంచి ఎక్కువగా ఆర్డర్లు వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కూడా వీటి ఎగుమతుల విషయంతో పాటు మరింత దిగుబడిని పెంచాలనే దిశగా అడుగులేస్తోంది.

Leave Your Comments

కొబ్బరి పీచుతో ఇంట్లోనే కూరగాయలు పండించండిలా!

Previous article

రంగురంగుల కాలీఫ్లవర్​.. పోషకాలు పుష్కలం

Next article

You may also like