ఆడవారి అందంలో మేకప్ కీలక భాగం. అందులోనూ కైపెక్కించే పెదాలకోసం వాళ్లు ఉపయోగించే లిప్‌స్టిక్ చాలా ప్రత్యేకం. వాటిల్లో చాలా రకాలు ఉంటాయి. ఫ్లేవర్‌ని బట్టి వాటి టేస్ట్‌తో పాటు, రంగు కూడా మారుతుంటుంది. ఆ లిప్‌స్టిక్ పెదాలను చూస్తేనే.. మగవాళ్లు మత్తెక్కిపోతుంటారు. మరి అలాంటి లిప్‌స్టిక్‌ను ఎలా తయారు చేస్తారో తెలుసా?.. వాటిని తయారీలో కొన్ని గింజలను ఉపయోగిస్తారు.. వాటినే లిప్‌స్టిక్ గింజలు అంటారు.. వాటని కూడా పండించాల్సి ఉంటుంది. అయితే, వాటిని ఎలా పండించాలి.. దిగుబడి ఎలా ఉంటుంది వంటి విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఓ రైతు ఈ కొత్తరకం పంటకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో తొలిసారిగా లిప్‌స్టిక్ గింజల పంటను మొదలుపెట్టి మంచి దిగుబడిని అర్జిస్తున్నాడు. జాఫ్రా మొక్కల ద్వారా ఈ గింజలు పండిస్తుంటారు. దాదాపు 30 ఏళ్లుగా దాసయ్యపాలెంకు చెందిన మడకం జంపాలరావు అనే రైతు.. తన 100 ఎకరాల్లో అనేక రకాల పంటలు సాగు చేస్తున్నాడు. అయితే, ఇటీవల జాఫ్రా సాగు గురించి తెలుసుకున్న ఆయన.. బాగా నచ్చడంతో తొలిగా 3 ఎకరాల్లో పంట ప్రారంభించాడు. సాధారణంగా ఈ పంట 14 నెలలకు గానీ పూర్తిగా చేతికి రాదు.. కానీ, జంపాలరావుకు మాత్రం 9 నెలలకే దిగుబడి చేతికందుతోంది.
మొదట ఈ మొక్కలను రంపచోడవరం నుంచ తీసుకొచ్చినట్లు జంపాలరావు తెలిపారు. అలా ఎకరాకు 160 మొక్కల చొప్పున 3 ఎకరాల్లో పంటను వేశారట. కొద్ది నెలల్లోనే పంట ఫలితాలు చూపించడం మొదలుపెట్టిందని జంపాలరావు తెలిపారు. ఇంటర్నెంట్ ద్వారా ఈ సాగు పద్దతిని తెలుసున్నట్లు తెలిపారు. వీటి గింజలకు అంతర్జాతీయ స్థాయిలో కిలో రూ. 1,200 వరకు డిమాండ్ ఉందని తెలిపారు. ఈ పంటను ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేస్తే.. గిరిజనులు జాఫ్రా సాగుకు ముందుకొచ్చే అవకాశం ఉందని అన్నారు.
నిజానికి ఈ జాఫ్రా మొక్కలు, కొండలు, గుట్టల్లో పెరుగుతుంటాయి. ఈ మొక్కలకు కాయలు కాస్తాయి.. వాటి నుంచి లిప్‌స్టిక్ గింజలను తీస్తారు. వీటిని లిప్‌స్టిక్‌తో పాటు, ఫుట్ ఫ్లేవర్స్, ఆహార ఉత్పత్తులు, రంగు అద్దకాలు, ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. కాగా, అమెరికాలో ఈ గింజలకు బాగా డిమాండ్ ఏర్పడింది. అక్కడ ఈ గింజలను అధికంగా ఉపయోగిస్తుంటారు. వీటి ఆకులను కామెర్లు, పాము కాటుకు కూడా మందుగా ఉపయోగిస్తుంటారు. వీటి గింజలు కిలో రూ. 100 నుంచి రూ.200 వరకు ఉంటాయి.