Harish Rao Perticipate Farmers Protest In Gajwel ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పోరుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. కేంద్రంతో ఎంపీలు పోట్లాడాలని, రాష్ట్రంలోని రైతులకు కేంద్ర వైఖరిని వివరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సూచనల మేరకు తెరాస నేతలు రోడ్డెక్కారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో తెరాస నేతలు ధర్నాలు, దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ చర్యలో భాగంగా జిల్లాల వ్యాప్తంగా ప్రధాని మోడీ దిష్టి బొమ్మలను దహనం చేశారు రైతులు మరియు తెరాస నాయకులు. కాగా ధర్నాలో పాల్గొన్న తెలంగాణ మంత్రి హరీష్ రావు (Harish Rao) కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
గజ్వేలులో రైతు వ్యతిరేక విధానాలపై చేపట్టిన ధర్నాలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ. రైతు బాగుండాలంటే బీజేపీని గద్దె దించాలని మండిపడ్డారు మంత్రి హరీష్. తెలంగాణ రైతులని కేంద్రం దగా చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం రాజకీయాలు చేస్తుందన్న మంత్రి, గ్రామగ్రామాన బీజేపీ నాయకులను రైతులు నిలదీయాలన్నారు. రైతులపైకి కార్లు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీదన్న మంత్రి వాళ్ళను తరిమికొట్టండని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, పంటను పండించడం రాష్ట్ర బాధ్యత అని అన్నారు. Harish Rao Perticipate Farmers Protest In Gajwel
తెలంగాణాలో సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామన్నారు. ఇప్పటివరకు రైతుబంధు పథకం కిందా 50 వేల కోట్ల రూపాయలు వెచ్చించామని చెప్పారు మంత్రి హరీష్. తెలంగాణ రైతులకు కేంద్రం చేసిందేమి లేదని, రైతుల పాలిట శాపంగా మారిన బీజేపీ ప్రభుత్వం గద్దె దిగితేనే రైతులు బాగుపడతారని అభిప్రాయపడ్డారు మంత్రి హరీష్ రావు. ధాన్యం కొనుగోలు విషయంలో తెరాస కు రైతులకు వైరం పెంచాలని కేంద్రం భావిస్తుందని, అందుకే పనిగట్టుకుని ధాన్యం సేకరించట్లేదని అన్నారు మంత్రి. Telangana Paddy Procurement Issue