మన వ్యవసాయంవ్యవసాయ వాణిజ్యం

కలుపు మొక్క సాగుతో ఐశ్వర్యవంతులైపోండిలా!

0
tumba-farming-is-best-for-farmers-in-less-rainy-places-know-all-about-tumba

పంటలో ఎక్కడైనా కలుపుమొక్కలొస్తే రైతులు చాలా బాధపడతారు. ఎంత తీసినా మళ్లీ మళ్లీ వస్తుంటే అసలు ఈ పంట ఎందుకేశాన్రా అనిపిస్తుంటుంది. అదే కలుపు మొక్కల్నే పంటగా వేస్తే.. ఆశ్చర్యం వేస్తుంది కదా.. అవును మీరు విన్నది నిజమే.. కలుపు మొక్కగా పేరుగాంచిన తుంబ సాగు రైతులకు మంచి ఆదాయాన్న తెచ్చి పెడుతుంది. అయితే, వీటికి బాగా నీళ్లుండాలి. కానీ, ఇప్పుడు ఎడారిలో కూడా రైతులకు ఈ సాగు మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో తుంబ సాగుతో లక్షలు సంపాదిస్తున్నారు. ఈ మొక్కలో ఔషధ గుణాలు ఉండటంతో మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉంది.

tumba-farming-is-best-for-farmers-in-less-rainy-places-know-all-about-tumba

ఈ ఔషధాన్ని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. జలుబు, కఫం, కుష్టు, జ్వరాలను ఈ ఔషధం నయం చేస్తుంది. దీని ఆయిల్​నను కొబ్బరి నునెతో కలిసి రోజూ తలకు రాసుకోవడం వల్ల జుట్టు నల్లబడుతుంది. నేల సంరక్షణలోనూ ఈ మొక్క కీలక పాత్ర పోషిస్తుంది. వీటితో పాటు పొట్టను క్లీజ్ చేయడమే కాక, మనసిక ఒత్తి, కామెర్లుస మూత్ర సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఈ ఔషధం ఉపసమనం కలిగిస్తుంది.

ముఖ్యంగా జూన్​, జులై మాసాల్లో ఈ సాగు ఎక్కువగా జరుగుతుంది. దీని విత్తనాలు 3 మీటర్ల దూరంలో 1-1 మీటర్ల వరుసలలో నాటాలి. ఎకరానికి 250 గ్రాముల విత్తనాలు పుష్కలంగా సరిపోతాయి. ఈ మొక్కకు కాసిన పండ్లు నవంబరు, డిసెంబరులో పసుపు రంగులోకి మారతాయి. అప్పుడే రైతులు వాటిని కోసి వాటి నుంచి విత్తనాలు వేరు చేస్తారు. అలా ఎకరానికి 2 క్వింటాళ్ల వరకు విత్తనాలు, 3 క్వింటాళ్ల వరకు పండ్లు పండుతాయి.

Leave Your Comments

Animal Husbandry: చికెన్​ అనగానే లొట్టలేసుకుటున్నారా.. ఈ విషయం తెలిస్తే ఏమంటారో?

Previous article

రైతుల కోసం వచ్చాం రాజకీయం చేయడానికి కాదు: మంత్రి నిరంజన్ రెడ్డి

Next article

You may also like