Herbal Mixture: మనిషి జీవితం మొదలైనప్పటి ప్రకృతితో పాటు జంతువులతో కలిసి జీవిస్తున్నాడు. ఆ తర్వాత ప్రకృతిని ఎలా తనకు ఉపయోగంగా మలుచుకోవాలో ఆలోచించి వ్యవసాయాన్ని కనిపెట్టాడు. పశువులను పాడి పరిశ్రమగా ఉపయోగించడం మొదలుపెట్టాడు. అలా ఇప్పటికీ ఆ నియమాలు పాటిస్తూనే మనిషి తన మనుగడ సాగిస్తున్నాడు.
దేశంలో ప్రస్తుతం 60 శాంతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మరోవైపు, రైతుల ఆదాయంలో పాడి పరిశ్రమక కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, ఇటీవల కాలంలో పశువులకు వ్యాధులు సంక్రమించడం సర్వ సాధారణమైపోయాయి. వాటి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోకపోడవం వల్ల పోషకాలు లోపించి.. వాటి ప్రాణాలకే ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. ఇలా వాటి ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా వాటి మీదే ఆధారపడే రైతులకు ఆర్థిక నష్టం తప్పదు.
అయితే, ఈ సమస్యను నివారించేందుకు ఓ చక్కని ఉపాయం ఉంది. ప్రకృతిలో దొరికే ఔషధ గుణాలు కలిగిన కొన్ని దినుసులతో హెర్బల్ మిక్చర్‌ను తయారు చేసి వాటికి ఆహారంగా ఇస్తే.. పశువుల్లో జీర్ణశక్తి మెరుగుపడి.. వ్యాధి నిరోధక శక్తి పెరుదుతుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే హెర్బల్ మిక్చర్‌కు కావాల్సిన దినుసులేంటో.. వాటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
Also Read: Black Pepper Cultivation: మిరియాల సాగులో మెలకువలు.!
ఉలవలు 1.5 కిలోలు,తాటి బెల్లం1.5 కిలోలు,యాలకులు 50 గ్రా, లవంగాలు100 గ్రా ,సొంఠి 200 గ్రా, మిరియాలు 150 గ్రా, తోక మిరియాలు 50 గ్రాములు, పిప్పళ్లు 50 గ్రా, వాము 200 గ్రా, పాల ఇంగువ100 గ్రా, వెల్లుల్లి 300 గ్రా, మెంతులు 150 గ్రా ,మోదుగుపువ్వు 300 గ్రా, దాల్చిన చెక్క50 గ్రా,నల్లనువ్వులు లేదా వేరు పిసరాకు 1.5 గ్రా,దినుసులను తీసుకుని.. వాటిని దంచి మిశ్రమంగా చేసుకొని తగు పాళ్లలో ఒక లీటరు వరకు ఆవ నూనె కలుపుకోవాలి.
అదే సమయంలో తడి తగలకుండా 2 నెలల పాటు నిల్వ ఉంచుకునే సదుపాయం కూడా ఉంది. ఇలా తయారు చేసుకున్న హెర్బల్ మిక్చర్‌ను పశువులకు నెలలో 10 నుంచి 15 రోజుల పాటు మేతగా వేస్తే సరిపోతుంది. ముఖ్యంగా పాలిచ్చే పశువులకు రోజుకు 50 గ్రాములు సరిపోతుంది. అదే రెండు నెలలు దూడలకైతే 5 నుంచి 10 గ్రాములు తినిపిస్తే సరి.
Also Read: Pests in Vegetables: వేసవి కూరగాయ పంటలో తెగుళ్ల యాజమాన్యం.!