ఆంధ్రప్రదేశ్

వ్యవసాయ సాంకేతికత సదస్సులో ఏపీ మంత్రి కన్నబాబు

0
Kannababu

Kannababu addresses Agricultural Technology Conference వ్యవసాయ సాంకేతికత 2021 – నూతన వ్యవసాయ సాంకేతికతలపై సదస్సు మరియు ప్రదర్శనను ప్రారంభించారు వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు. 17 నుండి 19 డిసెంబర్ 2021 వరకు 3 రోజల పాటు ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ సాంకేతికతలపై సదస్సు మరియు ప్రదర్శన జరగనుంది . ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు వ్యవసాయ ప్రదర్శనను లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ, పశు వైద్య మరియు ఉద్యాన విశ్వవిద్యాలయం లోని వివిధ పరిశోధనా స్ఠానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పట్టుపురుగుల శాఖ, ఏ. పి. సీడ్స్ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ సందర్శించారు .

Kannababu

వివిధ పంటల, వరి, మొక్కజొన్న, జొన్న, జొన్న, సజ్జా, రాగి, తృణధాన్యాలు – వారీగా, సమలు, కొర్రలు, పప్పు దినుసులు – కంది, మినుము, పెసర, శెనగ, నూనె గింజల పంటలు – వేరుశెనగ, నువ్వులు, ఆముదం, ప్రొద్దుతిరుగుడు, కుసుమ,వాణిజ్యపంటలు, చెరకు, ప్రత్తి వంగాడాలు, కోకో, డ్రాగన్, ఫ్రూట్, నట్ మెగ్ పంట,కొబ్బరి, జామ, మామిడి, దానిమ్మ, సపోటా, ట్యూబరోసే, బంతి, చామంతి, గ్లాడియోలస్,ఆర్చిడ్, గినియ, గిరిరాజ, వనరాజా, కడక నాధ్ కోళ్ళ పెంపకం, రోహు, కట్ల, పండుగబ్బ తదితర చేపలు, టైగర్ రొయ్యలు, పీతలు వాటి చెరువుల యజమ్మన్య పద్దతులు యాజమాన్య పద్దతులు, ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, ద్రోన్ల సాంకేతికత,కలుపుమొక్కలు, చీదపీడలు, కలుపు మొక్కల యాజమాన్యం, సమగ్ర సస్య రక్షణ, సమగ్ర సస్య పోషణ, సామగ్ర ఎరువుల యజమాన్యం, సమగ్ర పంటల యజమాన్యం, పంతకోత తదనంతర సాంకేతికతలు, వివిధ కంపెనీల ట్రాక్టర్లను, పురుగుమందులు, కీటకనాశీనులు, శిలీంద్ర నాశినులు, ఎరువులు, జీవన ఎరువులు, యంత్ర పరికరాలు, పనిముట్లు, జీవ నియంత్రనా పద్దతులు, సాగువిధానాలు, ఆహార ఉత్పత్తులు, విలువజోదింపు విధానాలు మరియు ఉత్పత్తులు, యాజమాన్య పద్దతులు, నూనె గింజల పంటలు, మేత విధానాలు, జీవ నియంత్రణ పద్దతులు, సమాచార కరపత్రాలు, విశ్వవిద్యాలయ ప్రచురణలు తదితరాలను ఆసక్తిగా తిలకించి మంత్రి వాటిగురించి అడిగి తెలుసుకున్నారు. Acharya N. G. Ranga Agricultural University
Kannababu అనంతరం సదస్సులో మంత్రి మాట్లాడుతూ, గృహోపకరణ, వాహనాలు తదితరాలకు సంబంధించిన సాంకేతికత క్షణాలలో విశ్రుతస్థాయిలో వాడకం లోకి వస్తుంది కానీ వ్యవసాయ సాంకేతికతలో అలా జరగడం లేదు. దీనికి పరిశోధనా ఫలితాల సాత్వర విస్తరణ అవసరం అన్నారు. అదేవిధంగా రైతులకు నూతన సాంకేతికతపై శిక్షణ అవసరం అని అన్నారు. అది గుర్తించి ముఖ్యమంత్రివై. యస్. జగన్మోహన రెడ్డి దీనికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మూడు యంత్రీకరణ శిక్షణా కేంద్రాలను ఒక్కక్కటి సుమారు 15 కోట్ల వ్యయంతో రాయలసీమ, దక్షిణ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వీటీకి రైతులను సందర్శన యాత్రలో భాగం తీసుకొని వెళ్ళి ప్రతి యంత్ర పరికరంపై శిక్షణను వ్యవసాయ మరియు అనుబంధ శాఖలవారు ఇప్పించాలని అన్నారు.

Kannababu

స్వాతంత్ర్యానంతర వ్యవసాయంలో ప్రపంచ వృద్ధిరేటు 2. 32% కాగా, మన దేశ వృద్ధి రేటు 3. 22% అని మరియు మన రాష్ట్ర వృద్ధి రేటు 8. 92%అని అన్నారు. వై.యస్ జగన్మోహన రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో 10,778 డా. వై. యస్. ఆర్. రైతు భరోసా కేంద్రాలను తీసుకొని వచ్చి, రైతుకు కావలసిన విత్తనం వేసిన దగ్గరనుండి కోత కోసేవరకు అవసరమైన సలహాలను, సూచనలను చేయడమే కాక, వారికి వాణిజ్య సేవలను, బ్యాంకింగ్ సేవలను, ఉత్పత్తి కారకాల సరఫరా మరియు చెల్లింపులు జరిగేలా చేసిప్రపంచ మార్కెట్లతో అనుసంధానిచేలా మన ప్రభుత్వం ఈ – మార్కెట్ సేవలను అందుబాటులోని తీసుకు రావడానికి ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుందన్నారు. అంతేకాక వీటికి రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయ సుమారు 800 మండి శాస్త్రవేత్తతో అనుసంధానించి ముఖ్యంగా సలహాలు, సూచనలు, శిక్షనా మరియు సామర్ధ పెంపు కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఇప్పటికే, డా. వై. యస్. ఆర్. రైతూ భరోసా , పి.యామ్. కిసాన్ మరియు వై. యస్. ఆర్. జలకళ ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా ప్రణాళికలు రచించి అమలు చేశామన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపెళ నూత్మెగ్, డ్రాగన్ ఫ్రూట్, ఆర్చిడ్స్ ట్యూబరోసా లాంటి పంటల వైపు వాతావరణాన్ని అనుసరించి ప్రోత్సహించాలన్నారు. రైతును ఆదుకునేందుకు వరద మరియు తుఫాన్ వరద నష్టాలను వెంటనే చెల్లించడం జరుగుతుందని, ఇన్షూరెన్స్ భీమా భారం రైతుకు భారం కాకుండా ఈ – పంట విధానం ద్వారా బీమా కట్టాల్సిన అవసరం లేకుండా చేయడం జరిగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. గిరిధర కృష్ణ గారు, విస్తరణ వ్యవసాయ పీఠాధిపతి డా. ఏ. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, వ్యవసాయ ఇంజినీరింగ్ మరియు సాంకేతికత పీఠాధిపతి డా. కె. యెల్లా రెడ్డి గారు, ఉన్నత విద్యాపీఠాధిపతి డా. జి. రామారావు గారు, గృహ విజ్ఞాన పీఠాధిపతి డా.టి. నీరజ గారు, పరీక్షల నియంత్రణాధికారి డా. పి. సుధాకర్ గారు, విద్యార్ధి కార్యకలాపాల పీఠాధిపతి డా. యం మార్టిన్ లూధర్ గారు, క్షేత్రాధికారి శ్రీ పి. వి. నరసింహరావు గారు, సంచాలకులు డా.ఎ. సుబ్బరామి రెడ్డి గారు, ముఖ్య అధికారి డా. పి. సాంబశివ రావు గారు, సంచాలకులు డా. ఎ. వి. రమణ గారు, ప్రణాళిక మరియు పర్యవేక్షణ అధికారిణి డా. వై. రాధ గారు, విస్తరణ ప్రధాన శాస్త్రవేత్తలు: డా. టి. గోపి కృష్ణ గారు, డా. బి. ముకుంద రావు, డా. జి‌ఐ. శివనారాయణ గారు, డా. కె. గురవా రెడ్డి గారు, డా. జి. రఘునాధ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. Minister Kannababu

Leave Your Comments

రైతుల కోసం ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు…

Previous article

రైతుబంధుపై సీఎం కేసీఆర్ స్పష్టత

Next article

You may also like