Lakhimpur Kheri incident was pre-planned ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ హింసాకాండలో 8 మంది రైతులు మరణించిన ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. లఖింపూర్ ఖేరీలో జరిగిన ఈ ఘటనలో నలుగురు రైతులు సహా 8మంది మరణించారు. రైతులను దారుణంగా కారుతో తొక్కించి చంపిన కేసులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రమేయం ఉండటంతో ఈ కేసుపై సిట్ త్వరితగతిన విచారించింది.
తాజాగా ఆ ఘటనపై Uttar Pradesh Police ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) షాకింగ్ విషయాలను బయటపెట్టింది. రైతుల మరణాలు ప్రమాదవశాత్తు జరగలేదని కుట్ర పూరితంగానే జరిగిందని, నిర్లక్ష్యం లేదా నిర్లక్ష్యానికి సంబంధించిన కేసు కాదని సిట్ స్పష్టం చేసింది. కాగా.. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోపినట్లు, పలువురు రైతులు గాయపడినట్లు యూపీ పోలీసులు వెల్లడించారు. Lakhimpur Kheri incident