No Rythubandhu For Farmers Who Paddy Cultivation In Yasangi తెలంగాణాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యాసంగి సీజన్ లో వడ్లు వేయరాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నొక్కి చెప్తున్నాయి. యాసంగి వడ్లు కొనేదే లేదని స్పష్టం చేస్తున్నాయి. అయితే కొన్నాళ్ళు వడ్లు కొనాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాటం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ముందు నుంచి కేంద్రం చెప్తున్న మాటకే కట్టుబడి ఉంది. ఈ సీజన్లో వడ్లు కొనబోమని ప్రత్యామ్నాయ పంటలవైపు రైతుల్ని ప్రోత్సహించాలని కేంద్రం రాష్ట్రానికి సూచిందింది. కాగా.. చేసేదేం లేక రాష్ట్ర నాయకత్వం కేంద్రానికి తలొగ్గింది. దీంతో యాసంగి పంటను రాష్ట్రము కొనుగోలు చేయబోదని, యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేసింది. దీంతో రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఆరుగాలం పండించిన పంట కల్లాల్లోనే ఉండిపోయింది. ఇక అకాల వర్షాల ధాటికి పంట నీటిపాలైంది. దాంతో కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన వైనం.
Telangana Paddy తాజాగా వ్యవసాయ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ CM KCR ని కలిసి ప్రస్తుత పరిస్థితిని వివరించారు. అధికారులు మాట్లాడుతూ.. యాసంగి పంటలో ప్రత్యామ్నాయ పంటలను పోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా వడ్లు వేస్తే వారికి రైతు బంధు ఇవ్వకూడదని సీఎం వద్ద ప్రతిపాదన పెట్టారు. వడ్లు వేసిన వారికి రైతుబంధు అమలుచేస్తే చేతులారా రైతుల్ని మోసం చేసినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. యాసంగిలో రైతులు వడ్లు సాగు చేస్తే ఆ ధాన్యాన్ని రాష్ట్రం కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం కేవలం కేంద్రం చేతుల్లోనే ఉంది. టన్నుల కొద్దీ ధాన్యాన్ని నిల్వ చేసే సామర్ధ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండని నేపథ్యంలో యాసంగి పంటలో వరి ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అధికారులు సీఎం వద్ద విన్నివించారు.
No Rythubandhu వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు విన్న ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ.. మన రైతులపై మనం కోపగించుకుంటే ఎలా? ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం వెతకాలన్నారు. మీరు ఆలోచించండి, నేను కూడా ఆలోచిస్తానంటూ అధికారులతో చెప్పారట. కానీ వరి వేస్తే రైతుబంధు ఇస్తారా? ఇవ్వరా? అన్నది సస్పెన్స్ గా మారింది. Telangana Farmers