వార్తలు

రైతు రవి కుటుంబానికి కోటి పరిహారం !

0
YS Sharmila Visits Medak

medak farmer ravi

YS Sharmila Visits Medak Farmer Ravi Family రవి (45) అనే రైతు తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. వరి పంట వేయొద్దని ప్రభుత్వం సూచించడం.. కుమారుడికి అనారోగ్యం.. వెంటాడుతున్న అప్పులు.. ఇవన్నీ ఆ అన్నదాతను కుంగదీశాయి. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా.. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం బొగుడ భూపతిపూర్ లో నివసిస్తున్న రైతు రవి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ సర్కారుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. YS Sharmila Medak Tour Updates

farmer sad

Farmer Ravi Suicide రవి కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల మాట్లాడుతూ.. రైతు రవి ఉసురు తీసుకున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. వడ్లు పండించాల్సిన రైతు ఉరికి వేలాడుతున్నాడు, రైతు గుండె ఆగిపోయేలా చేస్తున్న ప్రభుత్వం మనకు అవసరమా అని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఓ నియంత, అయన పాలనలో రైతుల ఇలా చనిపోవాల్సిందేనా అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారామె. రైతుల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటామని చెప్పి ఓట్లు అడిగిన తెరాస పార్టీ ఇప్పుడు వారిని ఆదుకోకపోగా రైతు పండించిన వడ్లను కూడా కొనుగోలు చేయడం లేదని వ్యాఖ్యానించారు. రైతులు ధాన్యం కుప్పలపై చనిపోతున్నారని, ఇది తెలంగాణ రైతుల దౌర్భాగ్య స్థితి అంటూ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. తెలంగాణాలో 30 మంది రైతులు చనిపోయారు అందులో రవి అనే రైతు సీఎం కి లేఖ రాసి చనిపోవడం కలచివేస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల. YS Sharmila Visits Medak

ys sharmila

Telangana Farmers Suicide బంగారు తెలంగాణ చేస్తా అని ప్రగల్భాలు పలికి ఇప్పుడు రాష్ట్రాన్ని గాలికి వదిలేశాడని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు షర్మిల. ఆఖరిగింజ వరకు కొనుగోలు చేపడతామని చెప్పిన సీఎం నేడు మాట తప్పి రాజకీయాలు చేస్తున్నారు అని ఆరోపించారు. ప్రభుత్వాలే మాట తప్పితే ఇక బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించారు. ఇకపోతే వడ్లు కొనుగోలు చేయాల్సిందేనని, దానికి మద్దతు ధర ప్రకటించాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. పంట పండించడం వరకే రైతు బాధ్యతని, మద్దతు ధర రైతు హక్కుఅని ఆమె అన్నారు. వరి వద్దన్నా సీఎం మనకు వద్దు అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

ys sharmila

రవి కుమార్ కుటుంబం దయనీయ స్థితిలో ఉందని, తల్లిదండ్రులకు పెన్షన్ రావడం లేదని, కొడుకు ఆరోగ్యం బాగాలేదని మెడికల్ ఖర్చు అవుతుందని.. రవిది ప్రభుత్వ హత్య అంటూ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తీరుతో మరణించిన రవి కుమార్ కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. Farmer Ravi writes to CM KCR

ys sharmila

Leave Your Comments

రైతు నెల ఆదాయం ఎంత?

Previous article

సరిహద్దులను ఖాళీ చేసిన రైతులు

Next article

You may also like