వార్తలు

బీహార్‌లో ఎరువుల కొరతతో రైతుల నిరసనలు..

0
Bihar farmers

Bihar farmers

Bihar farmers block roads over fertiliser shortage బీహార్‌లో రబీ సీజన్ లో ఎరువుల కొరతపై సుదీర్ఘ నిరసనలు చేపట్టారు రైతులు. బీహార్‌లోని కోషి-సీమాంచల్, షహాబాద్ ప్రాంతాలు మరియు దక్షిణ జిల్లాల్లోని పలు గ్రామాలకు చెందిన రైతులు రబీ పంటల విత్తడానికి అవసరమైన ఎరువులు అయిన డైమోనియం ఫాస్ఫేట్ (DAP) తీవ్రమైన కొరతను నిరసిస్తున్నారు. ఈ ప్రాంతంలో రబీ విత్తనాలు సరఫరా నవంబర్ 15 మరియు డిసెంబర్ 15 మధ్య ఉంటుంది. కానీ తీవ్ర కొరత ఏర్పడటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. సుపాల్‌ జిల్లాకు చెందిన విజయ్‌ యాదవ్‌, రతన్‌ మండల్‌ అనే రైతులు ఆదివారం నుంచి రోజూ ఆరు-ఏడు గంటలపాటు నిర్ణీత ఎరువుల డీలర్‌ దుకాణం వద్ద క్యూలో నిలబడినా ఫలితం లేకుండా పోయిందని వారు వాపోతున్నారు.

farmers

అయితే గతంలో ఖరీఫ్ సీజన్‌లో యూరియా కొరత కారణంగా రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తాయి. సాధారణంగా గోధుమ, మొక్కజొన్న, పప్పుధాన్యాలు మరియు నూనె గింజలు వంటి రబీ పంటల విత్తడం డిసెంబర్ 15 నాటికి పూర్తి కావాలి. కానీ ఎరువుల కొరతతో పెండింగ్ లో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు కిషన్‌పూర్ నివాసి యాదవ్. ఇకపోతే పొరుగున ఉన్న సహస్ర మరియు మాధేపూర్ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో చిన్న మరియు సన్నకారు రైతులు కూడా ఇదే సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ జిల్లాల్లో 500-600 మంది రైతులు రోజూ దుకాణాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సిందే. దీంతో తమ నిరసనను తెలియజేసేందుకు వందలాది మంది రైతులు జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధించి, బ్లాక్ ఆఫీసుల చుట్టూ ప్రదర్శనలు నిర్వహించారు. Bihar farmers Protest

cm nitish kuimar

సోమవారం బ్లాక్‌ ఆఫీస్‌ ఎదుట ఎన్‌హెచ్‌-106ను, ఎన్‌హెచ్‌-57తో కూడలిని రెండు గంటల పాటు అడ్డుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. సుపాల్‌లోని సరైగర్, ప్రతాప్‌గంజ్ మరియు కిషన్‌పూర్‌లోని గ్రామస్థులు కూడా NH-57 మరియు NH-327లను అడ్డుకున్నారు. మంగళ, బుధవారాల్లో కూడా పలు చోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. జిల్లా వ్యవసాయ అధికారి సమీర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్‌, నవంబర్‌కు 8,500 టన్నుల డీఏపీ అవసరం ఉండగా ఇప్పటివరకు కేవలం 3,500 టన్నుల సరఫరా మాత్రమే జరిగిందని అయన తెలిపారు. కాగా.. జిల్లాకు రబీ సీజన్‌కు 16,000 టన్నుల డీఏపీ అవసరం కాగా కేవలం 3,450 టన్నులు మాత్రమే వచ్చిందని పార్లమెంట్ సభ్యుడు సుపాల్ దిలేశ్వర్ కామత్ లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. fertiliser shortage in bihar

fertiliser shortage

అయితే ఈ సమస్యపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఉన్నట్లు అయన ఒప్పుకున్నారు. అయితే వీలైనంత త్వరగా డీఏపీ సరఫరా అయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం నితీష్ కోరారు. మరో సమస్య ఏంటంటే.. ఎరువుల కొరత కారణంగా దళారులు రెచ్చిపోతున్నారు. బ్లాక్‌మార్కెటింగ్‌ చేస్తూ రైతుల్ని నట్టేట ముంచుతున్నారు. 50 కిలోల బస్తాలు రూ.1,600-1,800కి విక్రయిస్తున్న పరిస్థితి. Bihar Farmers Problems

సంబంధిత శాఖ అంచనా ప్రకారం బీహార్‌కు ఈ క్రింది పరిమాణంలో ఎరువులు అవసరం ఉన్నది:

1 మిలియన్ టన్నుల యూరియా
150,000 టన్నుల మ్యూరేట్ ఆఫ్ ఫాస్ఫేట్
200,000 టన్నుల కాంప్లెక్స్ (నత్రజని, ఫాస్ఫేట్ మరియు పొటాష్ మిశ్రమం)
125,000 టన్నుల SSP

Leave Your Comments

డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు గెలుచుకున్న వీసీ

Previous article

రైతు సంఘం మోర్చా ఎత్తివేత?

Next article

You may also like