Jawad shatters hopes of paddy farmers in Odisha coastal districts జవాద్ తుఫాను కారణంగా ఒడిశాలోని కోస్తా జిల్లాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ఈ ఏడాది అధిక దిగుబడి వస్తుందని ఆశించిన వరి రైతుల ఆశలను వమ్ము చేసింది. పలు జిల్లాలో భారీ వర్షాల కారణంగా వేల హెక్టార్లలో పంట నీటమునిగింది.
ఒడిశాలోని గంజాం, గజపతి, జగత్‌సింగ్‌పూర్, ఖోర్ధా, పూరీ, భద్రక్, బాలాసోర్, జాజ్‌పూర్, కేంద్రపారా, కటక్ జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. దీంతో రైతన్నలు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఆరుగాలం పండించిన పంట నీటమునిగి రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కష్టమంతా వర్షంలో కొట్టుకుపోవడంతో మేం ఎలా బతుకుతామో తెలియడం లేదని పారాదీప్‌లోని మరో రైతు నిరంజన్ మొహంతి చెప్పారు. jawad cyclone
కాగా వర్షపు నీటిలో మునిగిపోయిన వరి పంట చేతికి వచ్చే అవకాశం లేదని భువనేశ్వర్‌లోని ఒడిశా అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీకి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త అమరేష్ ఖుంటియా తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని కోస్తా జిల్లాల్లో నవంబరు మొదటి వారంలో కురిసిన అకాల వర్షాలకు తక్కువ వ్యవధిలో పండించిన వరి పంట దెబ్బతింది. 2021 ఖరీఫ్‌లో ఒడిశా అంతటా 3.5 మిలియన్ హెక్టార్లకు పైగా వరి సాగు చేయబడింది. అకాల వర్షాల కారణంగా వరి రైతులే కాకుండా.. మిర్చి, కూరగాయల రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. Jawad shatters
మే నెలలో యాస్ తుఫాను కారణంగా మేము చాలా పంట నష్టాన్ని చవిచూశాము. ఈసారి నష్టాన్ని భర్తీ చేస్తామని మేము భావించాము. కానీ డిసెంబర్ లో కురిసిన వర్షాలను మా ఆశలకు అడ్డుకట్ట వేశాయని ఓ రైతు కన్నీరుపెట్టుకున్నారు. గంజాం జిల్లా, పత్రాపూర్ బ్లాక్ పరిధిలోని ఉలుమా గ్రామంలో 57 ఏళ్ల రైతు డిసెంబర్ 5న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Odisha Farmer Suicide
దీంతో సంబంధిక అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయడం ప్రారంభించారు. ఒక వారంలోగా పంట నష్టం నివేదికలను అందజేయాలని జిల్లా అధికారులను కోరామని చెప్పారు ఒడిశా ప్రత్యేక సహాయ కమిషనర్ ప్రదీప్ జెనా తెలిపారు. రాష్ట్ర రిలీఫ్ కోడ్ ప్రకారం నష్టాన్ని అంచనా వేసిన తర్వాత ప్రభుత్వం బాధిత రైతులకు పరిహారం ప్రకటిస్తుందని ఒడిశా రెవెన్యూ మంత్రి సుదామ్ మరాండి (Shri Sudam Marndi) తెలిపారు.