Turkey Chickens: మన దేశంలో బ్రాయిలర్, లేయర్ కోళ్ల పరిశ్రమ అతి పెద్ద పరిశ్రమ. వీటి తర్వాత బాతుల పెంపకం, టర్కీ కోళ్ళు పెంపకం వంటి చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో టర్కీ కోళ్ళను ఇంటి దగ్గర పాములు వాటి నుండి రక్షణ పొందడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. కొంతమంది మాంసం కోసం ఉపయోగిస్తారు. ఎందుకంటే దీని మాంసం పలుచగా ఉంటుంది. మాములు కోళ్ళలాగే పోషణ ఉంటుంది. వ్యాధులు తక్కువ.
శాస్త్రీయ నామము : మేలియాగ్రిస్ గాలోపావో
మూలం : టర్కీ కోళ్ళ ఉత్తర మరియు మధ్య అమెరికా ప్రాంత దేశాలకు చెందినవి. క్రమేణా ఇవి యూరప్ మరియు ఇతర దేశాలకు వ్యాప్తి చెందాయి.
భారతదేశంలో టర్కీ కోళ్ళ జాతులు :
➤ బ్రాడ్ బ్రేస్టెడ్ బ్రాంజ్
➤ బ్రాడ్ బ్రేస్టెడ్ తెల్లని
➤ తెల్ల రంగు కలిగిన బెల్ట్స్ విల్లే
➤ నందనం టర్కీ
తెల్ల రకాల టర్కీలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. తెల్లటి కోళ్లు ఉష్ణ తీవ్రతను తట్టుకోగలవు. కనుక యివి మన దేశ వాతావరణ పరిస్థితులకు అనువైనవి. మేలుజాతి రకాల 20 వ వారానికి సుమారు 12 -16 కిలోలు బరువు కాగలవు. వీటిని మంచి పోషణతో పాటు సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టాలి కనుక వీటికయ్యే ఖర్చు కూడా ఎక్కువే. మన దేశంలో ఎక్కువగా చిన్న టర్కీలు అనగా సుమారు 8 కిలోల బరువు కలిగి ఉన్న వాటిని తోటల్లో రెంజీ పద్ధతిలోను లేదా సంప్రదాయ పద్ధతిలోను తక్కువ ఖర్చుతో పెంచుతుంటారు. మన దేశంలో దక్షిణ రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పెంపకం ఎక్కువ. ఇది మాంసానికి ప్రసిద్ధి.
ఇవే కాకుండా మన దేశంలో మరికొన్ని టర్కీ జాతి రకాలు : –
➤ స్లేట్
➤ బ్లాక్
➤ నరంగ్ సెట్ట
➤ బోర్బన్ రెడ్
➤ వైట్ హాలండ్
టర్కీ కోళ్ళ పెంపకంలో యాజమాన్య పద్దతులు :
పెంపకం పద్దతులు :
టర్కీలను ఆరుబయట పెంచవచ్చు లేదా గదిలో (ఇంటెన్సివ్ సిస్టం)లో పెంచవచ్చు.
ఆరు బయట / లేదా పెరటి కోళ్ల పెంపకం :
ఉపయోగాలు :
➤ దాణా ఖర్చు సగం తగ్గుతుంది
➤ పెట్టుబడి తక్కువ
➤ ఖర్చు ఆదాయం నిష్పత్తి ఎక్కువ
ఆరుబయట పద్ధతి కింద, చుట్టూ కంచె వేసిన ఒక ఎకరా పొలంలో 200 – 250 పెద్ద టర్కీలను పెంచవచ్చు. రాత్రి సమయంలో ఒక్కొక్క టర్కీకి 3 – 4 చదరపు అడుగుల వంతున అవి తల దాచుకోవడానికి వసతి కల్పించాలి. అవి చెత్త చెదారం తినేటప్పుడు, శత్రు జంతువులు నుంచి వాటిని కాపాడాలి. నీడ మరియు చల్లగా వుండడానికి చెట్లు నాటితే మంచిది. పరాన్నజీవుల వల్ల వ్యాధులు సోకకుండా వాటిని అప్పుడప్పుడు ఒక చోటి నుంచి మరోచోటికి మార్చుతుండటం అవసరం.
ఆరు బయట పద్ధతిలో దాణా :
టర్కీలు భూమిలోని పురుగులను, చెత్తాచెదారాన్ని బాగా తింటాయి. ఈ రకంగా అవి వానపాములను, సూక్ష్మజీవులను, నత్తలను, చెద పురుగులను, వంటింటి వ్యర్థ పదార్థాలను తినగలుగుతాయి. ఇవన్నీ మంచి మాంసకృత్తులు. ఇందువల్ల దాణా ఖర్చు సగం కలిసివస్తుంది. ఇవే కాకుండా జనుము, స్టైలో, ఇతర పప్పు ధాన్యపు జాతి మొక్కలను కూడా వీటికి ఆహారంగా వేయవచ్చు. టర్కీలకు వచ్చే కాళ్ల బలహీనతలను కుంటు పడడాన్ని కాల్షియం (సున్నం) వాడకంతో అరికట్టవచ్చు. ఆల్చిప్పల్లో కాల్షియం ఎక్కువగా వుంటుంది. అందువల్ల వారానాకి ఒక్కొక్క టర్కీకి 250 గ్రాముల ఆల్చిప్పల వంతున ఇవ్వవలసి ఉంటుంది. తిండి ఖర్చు తగ్గించుకోవడానికి వీలుగా 10 % ఆహారాన్ని కూరగాయల వ్యర్ధాల రూపంలో ఇవ్వవచ్చు.
ఆరోగ్య సంరక్షణ :
ఆరుబయట పెంపకంలో టర్కీలకు ఆరోగ్యపరంగా, పొట్టలో ఏలిక పాములబెడద, బయట ఎర్రనల్లి వంటి పురుగుల బెడద ఉంటుంది. అందువల్ల టర్కీల ఆరోగ్యంగా పెరగాలంటే నెలకొకసారి నులిపురుగుల మందు ( డివార్మింగ్ , డిప్పింగ్ ) వాడటం తప్పనిసరి.
2) షెడ్ లో పెంపకం ( ఇంటెన్సివ్ ఫార్మింగ్ ) :
ప్రయోజనాలు :
➤ గుడ్లు పెట్టే సామర్థ్యం పెరుగుతుంది.
➤ మెరుగైన యాజమాన్యం , మెరుగైన ఆరోగ్య సంరక్షణ
గదిలో పెంచడం :
గదిలో ( షెడ్ లో ) పెంచడం వల్ల టర్కీలకు, ఎండ, వాన, గాలి మరియు శత్రు జీవుల నుంచి రక్షణ లభిస్తుంది మరియు సౌకర్యంగా ఉంటుంది. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో, టర్కీల షెడ్ తూర్పు – పడమరలుగా ( పొడవు) ఉండటం అవసరం. రెండు షెడ్ల మధ్య కనీసం 20 మీటర్ల దూరం ఉండాలి. బీ టర్కీ పిల్లల షెడ్ , పెద్ద టర్కీల షెడ్ నుంచి కనీసం 50 – 100 మీటర్ల దూరంలో ఉండాలి. షెడ్ వెడల్పు 9 మీటర్లు మించరాదు. గది ఎత్తు నేల నుంచి 2.6 – 3.3 మీటర్ల వరకు ఉండవచ్చు. వాన నీరు షెడ్ లోకి చిందకుండా ,పై కప్పు గోడల పైన 1 మీటర్ దిగువ వరకు ఉండేలా శ్రద్ధ వహించాలి. షెడ్ల నేల ( ఫోరింగ్ ) మన్నికగా , సురక్షితంగా ఉంటూనే , చౌకగా ఉండేలా చూడాలి. అయితే మేలు.
మందంగా లిట్టర్ పరచిన నేలపైన టర్కీలను పెంచడానికి సంబంధించిన సాధారణ యాజమాన్య పద్ధతులు, దేశవాళీ కోడి పిల్ల పెంపకంలో అనుసరించే మాదిరిగానే ఉంటాయి. సాధారణంగా నేలను కప్పే (లిట్టర్ ) పదార్ధాలు, రంపపు పొట్టు , వరి పొట్టు ( ఊక ) , మెత్తటి కలప పీచు వంటి వాటిని బ్రూడింగ్ లో నేలను కప్పడానికి ( లిట్టర్ ) వాడతారు. వీటిని మొదట్లో 2 అంగుళాల మందంగా వేసి, రోజులు గడిచే కొద్దీ మందం పెంచుతూ 3 – 4 అంగుళాల మందం వరకు ఉండవచ్చు. ఈ పదార్ధాలు గట్టి పడిపోకుండా వాటిని తరచూ పైకీ కిందకీ మార్చుతుండాలి. టర్కీలు సాధారణ కోడి పిల్లల కంటే పెద్ద సైజులో ఉంటాయి. కాబట్టి అవి తిరుగాడే నేల విస్తీర్ణం, నీటి పాత్రలు దాణా పాత్రల సైజు వాటికి అనుగుణంగా ఉండేలా శ్రద్ధ వహించాలి.
టర్కీల అవసరమైన తిరుగాడే నేల, నీటి పాత్ర, దాణా పాత్ర పరిమాణాలు : –
నేల విస్తీర్ణం ( చదరపు అడుగులు ) | దాణా పాత్ర పొడవు ( సెంటీ మీటర్లు ) | నీటి పాత్ర ( సెంటీ మీటర్లు ) |
1.25 |
2.5 |
1.5 |
2.5 |
5.0 |
2.5 |
4.0 5.0 |
6.5 7.5 |
2.5 2.5 |
2) పునరుత్పత్తి పద్దతులు :
సహజంగా జత కూడడం : పెట్ట నిష్పత్తి మధ్య రకం టర్కీలైతే 1: 5 ,పెద్ద కంపెనీల అయితే 1:3 జత కూడిన పెద్ద ఆడ టర్కీ సగటున ఒక్కొకటి 80 – 100 గుడ్లు పెడుతుంది. టర్కీ కోళ్ళలో సాధారణంగా జత కలవడానికి శారీరక ఎదుగుదల 30 వారాలు. ఏడాది వయస్సు నిండిన మగ టర్కీ లలో లైంగిక శక్తి సన్నగిల్లుతుంది, అందువల్ల వీటిని వీలున్నంతవరకు జతకూడడానికి ఉపయోగించకూడదు. ఎదిగిన మగ టర్కీలలో ఏదో ఒక ఆడ టర్కీ పట్ల మక్కువ పెంచుకునే స్వభావం ఉంటుంది. అందువల్ల మగటర్కీలను ప్రతి 15 రోజులకొకసారి మారుస్తుండాలి.
కృత్రిమ గర్భధారణ : కృత్రిమ గర్భధారణ వల్ల కలిగే ప్రయోజనమేమిటంటే ఎదిగిన టర్కీ పుంజును నుంచి వీర్యం సేకరించి పెట్టలకు కృత్రిమంగా వీర్యాన్ని ఎక్కించడం ద్వారా టర్కీ కోళ్ళల్లో మొత్తం సీజను అంతా పునరుత్పత్తి సామర్థ్యం ఉంటుంది.
టర్కీకోళ్ళ పెంపకంలో మరి కొన్ని యాజమాన్య పద్ధతులు :
ఎ) టర్కీలను పట్టడం : ఏ వయసు టర్కీలైన, వాటిని కర్రతో అదిలించి ఒక చోట నుండి మరొక చోటికి తేలికగా పంపవచ్చు. టర్కీలను పట్టడానికి చీకటి గది అయితే మేలు. టర్కీని రెండు కాళ్ళు పట్టుకుని పైకి ఎత్తాలి, ఇలా ఎత్తినందువల్ల వాటికి నొప్పి ఉండదు. అయితే కూతకు వచ్చిన టర్కీని 3–4 నిమిషాలను మించి అలా తలకిందులుగా వేలాడేలా వుంచకూడదు.
బి) ముక్కు కత్తిరించడం : వాటి ఈకలు పీకుకోకుండా , తోటి టర్కీ పిల్లలను చంపకుండా నివారించడానికి టర్కీ కోడిపిల్లల ముక్కు ముక్కు కత్తిరించడం అవసరం. పుట్టిన మొదటి రోజునైనా, 3 – 5 వారాల వయస్సులోనైనా సరే టర్కీల ముక్కు కత్తిరించవచ్చు. ముక్కు రంధ్రాల నుంచి ముక్కు పొడవులో సగం కత్తిరించవచ్చు.
సి) ముక్కు కండను తొలగించడం : టర్కీల ముక్కు మొదట్లో ముందుకు పొడుచుకు వచ్చినట్లు ఉంటుంది. మాంసపు ముద్దను స్నూడ్ లేదా డ్యూబిల్ అంటారు. ఆ కండను పీక్కోవడం వల్లనో, పోట్లాట వల్లనో తలకు గాయం కాకుండా నివారించడానికి ఆ కండను తొలగించాలి. పుట్టిన మొదటి రోజున ఆ కండను వేలితో నొక్కి తొలగించవచ్చు. 3 వారాల వయసులో తలకు దగ్గరగా పదునైన కత్తెరతో దానిని కత్తిరించవచ్చు.
డి) కాలి బొటన వేలి మొన అదిమి వేయడం : – పుట్టిన మొదటిరోజున టర్కీ బొటన వేలు మొనను గోరుతో సహా, కాలి చివరి వేలు సందులోకి నొక్కి వేయాలి.
దాణా నిర్వహణ : దాణా రెండురకాలుగా ఇవ్వవచ్చు.
ఒకటి : దంచి ఇవ్వడం, రెండు : గుళికల రూపంలో ఇవ్వడం,
దేశవాళ కోడిపిల్లలతో పోల్చి చూస్తే , టర్కీలకు నూంసకృత్తులు, విటమిన్లు, ఖనిజలవణాలు, శక్తిని ఇచ్చే పదార్ధాలు మరింతగా అవసరమవుతాయి . శక్తిని ఇచ్చే పదార్థాలు, మాంసకృత్తులు, అవసరనుయ్యే పరిమాణం పుంజుకు ఒకరకంగా, పెట్టకు మరొక రకంగా వుంటుంది. అందునల్ల, వాటిని వేరువేరుగా పెంచితే మంచి ఫలితాలు సాధించవచ్చు. దాణా పాత్రలోనే దాణాను వేయాలి. నేలమీద వేయకూడదు. ఒక రకమైన దాణాకు బదులు మరొక రకమైన దాణా ఇవ్వవలసివస్తే, ఆ మార్పు క్రమేణా జరగాలి. టర్కీలకు శుభ్రమైన నీరు తెంపులేకుండా ఎప్పుడూ అందుబాటులో వుంచాలి. ఎండాకాలంలో మరిన్ని నీటి పాత్రలు పెట్టాలి. ఎండాకాలంలో పగటిపూట ఎండ తక్కువగావుండే వేళలలో దాణా మేపాలి. కాళ్లు చచ్చుబడిపోకుండా, ఒక్కక్క టర్కీకి రోజుకు 30-40 గ్రాముల వంతున ఆల్చిప్పల పొడిని వేయాలి.
ALSO READ : PJTSAU లో అంతర్జాతీయ మృత్తికా దినోత్సవ కార్యక్రమం
మొక్కలు, గడ్డి మేపడం : –
షెడ్లలో పెంచే పద్దతిలో, టర్కీకి దాణాలో 50 % మొక్కలను, ఆకులను దంచి ఇవ్వవచ్చు. ఏ వయస్సులో టర్కీ కైనా, తాజా జనుము మొక్క మంచి జలవర్ధక ఆహారం. ఇంతే కాకుండా స్టైలో గడ్డిని, దేశమంత మొక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మేపి దాణా ఖర్చు తగ్గించుకోవచ్చు.
వయస్సు( వారాలలో) | టర్కీ సగటు బరువు
( కిలోలు )
పుంజు / పెట్ట |
తినే మొత్తం దాణా (కిలోలు )
పుంజు / పెట్ట |
ఆ స్థాయి వరకు మొత్తం దాణా సామర్ధ్యం
పుంజు /పెట్ట |
4 వారాల వరకు | 0.72 0.63 | 0.95 0.81 | 1.3 1.3 |
8 వారాల వరకు | 2.36 1.90 | 3.99 3.49 | 1.8 1.7 |
12 వారాల వరకు | 4.72 3.85 | 11.34 9.25 | 2.4 2.4 |
16 వారాల వరకు | 7.26 5.53 | 19.86 15.69 | 2.8 2.7 |
20 వారాల వరకు | 9.62 6.75 | 28.26 23.13 | 3.4 2.9 |
- v) టర్కిలకు వచ్చే సాధారణ వ్యాధులు: టర్కీలకు , కోళ్ళ మాదిరిగానే వివిధ జబ్బులు సంక్రమిస్తాయి. ఈ జబ్బులు కోళ్ళ జన్యు రకాలు, ఉష్ణోగ్రత, పరిసరాల పరిశుభ్రత, దాణా లోపాలు, రోజువారి యాజమాన్య పద్దతులపై ఆధారపడుతుంది. టర్కీ కోళ్ళల్లో ముఖ్యంగా మొదటి 8 వారాలకు మరణాల సంఖ్య మిగతా వయస్సుతో పోలిస్తే ఎక్కువ. టర్కీ వ్యాధుల్లో మైకోప్లాస్మోసిస్, ఊపిరితిత్తుల న్యాధి, అరిజోనోసిస్, నీలి దువ్వెన (బ్లూ కూంబ్), ఎరిసిపెలస్ , టర్కీ కొరైజ. సంబంధించిన న్యాధులు ముఖ్యమైనవి. ఈ జబ్బులు వచ్చినప్పుడు కోళ్ళల్లో బరువు తగ్గి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
రేంజి (పెరటి కోళ్ళ యాజమాన్యం) సద్దతిలో ముఖ్యంగా మూడు నెలలకోసారి నట్టల నివారణ చేపట్టాలి. పిపరాజిన్ మందును 0.5 మి.లీ.కోడి ఒక్కంటికి ద్వారా యివ్వాలి. సాంప్రదాయ పద్దతిలో పెంచే టర్కీ నిపుణుల సలహా మేరకు టీకాలు ఇవ్వాలి.
టర్కీలలో టీకా కార్యక్రమం :
మొదటి వారంలో – కొక్కెర తెగులు వ్యాధి బి – 1 లేదా యఫ్ – 1 కంటి ముక్కులో ఒక చుక్క
4 వ వారం – మరోసారి కొక్కెర తెగులు వ్యాధి టీకా
5 వ వారం – కోళ్ళ మసూచి టీకా ( సూడి కండరాలకు )
8 వ వారం – కొక్కెర తెగులు ఆర్ 2 బి లేదా ముక్తేస్వర్ ( సూది కండరాలకు )
10 వ వారం – కలాల వ్యాధి టీకా ( సూచన మేరకు )
25 వ వారం – మరోసారి కొక్కెర తెగులు ఆర్ 2 బి
టర్కీల మార్కెటింగ్ :- 16 నారాలకు ఎదిగిన టర్కీ పుంజు బరువు
- 26 కిలోలు , టర్కీ పెట్ట బరువు 5.53 కిలోలు వుండాలి. టర్కీల మార్కెటింగ్ కు ఈ బరువులు అనువైనవి.
టర్కి గుడ్డు: సాధారణంగా టర్కీ గుడ్డు బరువు = 65 గ్రా . టర్కీలు 30వ వారం నుంచి గుడ్డుపెట్టడం మొదలుపెడతాయి ; మొదటి గుడ్డు పెట్టిన రోజు నుంచి 24 వారాలపాటు అది గుడ్లు పెడుతుంది. టర్కీ లకు గుడ్లు పొదగడానికి పట్టే సమయం – 28 రోజులు. టర్కీ కోడిపిల్లల సగటు బరువు 50 గ్రా ఉండగా వాటికి తగిన దాణా ఇస్తూ, కృత్రిమ కాంతి ప్రసారంలో పెంచితే , టర్కీ కోళ్ళు ఏడాదికి 80 – 100 గుడ్లు వరకు కూడా పెడతాయి . దాదాపు 70 % గుడ్లు మధాహ్న సమయంలోనే పెడతాయి.
టర్కీ గుడ్డులో పోషక విలువలు : టర్కీ గుడ్డులో మాంసకృత్తులు ; 13.1 1., లిపిడ్ (కొవ్వు పదార్థాలు – 11 – 8 . పిండిపాదార్థాలు – [ 1.7 % ఖనిజ లవణాలు – 10.8.1. వుంటుంది . ఒక గ్రాము పచ్చసొనలో కొలెస్టిరాల్ 15-61 – 23-77 మిల్లీ గ్రాముల ఉంటుంది.
టర్కీ మాంసంలో పోషక విలువలు : టర్కీ మాంసం చాలా పలుచగా వుంటుంది . వంద గ్రాముల మాంసలో మాంసకృత్తులు – 24 % , కొవ్వు పదార్థాలు – 6 -6 %, శక్తి విలువ – 162 కేలరీలు. టర్కీ మాంసంలో పొటాషియం, కాల్షియం సున్నం), మెగ్నిషియం. ఇనుము, సెలెవియం, జింక్, సోడియం మొదలైన ఖనిజ లవణాలు వుంటాయి. శరీరానికి తప్పనిసరిగా కావలసిన యామినో ఆమ్లాలు, నియాసిన్, బి6, బి12, వంటి విటమిన్లు టర్కీ మాంసంలో పుష్కలంగా వుంటాయి. అసంతృప్త (అన్ శాచ్చురేటెడ్) ఫాబీ ఆమ్లాలు, శరీరానికి తప్పనిసరిగా కావలసిన ఫాటీ ఆమ్లాలు, ఎక్కువగా వుండడమే కాక , కొలెస్టారాల్ తక్కువగా ఉండడం విశేషం.
టర్కీ కోళ్ళ పెంపకం ద్వారా ఆదాయం వివరాలు : 24 వారాల వయసులో 10 – 20 కిలోల బరువున్న టర్కీ పుంజును విక్రయించడం వల్ల, దాని పెంపకానికి అయిన 300 – 450 రూపాయల ఖర్చుపోను, 500-600 రూపాయల ఆదాయం. మరియు 24 వారాల వయసున్న టర్కీ పెట్ట అమ్మకం వల్ల 300 – 450 రూపాయల ఆదాయం లభిస్తుందని మార్కెట్ అధ్యయనం తెలియజేస్తుంది.
– డా. పి. లక్ష్మీ ప్రసన్న,రీసెర్చ్ స్కాలర్ ఎన్.టి. ఆర్ కాలెజ్ వెటర్నరీ సైన్స్ గన్నవరం -ఫోను నంబరు : 7095810733
డా.టి సుష్మిత- సహాయ ఆచార్యులు ఎన్.టి.ఆర్. కాలేజీ వెటర్నరీ సైన్సు గన్నవరం, PH : 9440380083
Also Read : పంట కోసం రైతు… రైతు కోసం కేసీఆర
Also Watch: