పశుపోషణమన వ్యవసాయం

పశువుల దాణాలో పామ్ కెర్నల్ కేక్ వాడకం ఎంతో లాభదాయకం

0
palm kernel cake

పరిచయం :

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో, మానవులు మరియు పశువుల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ పంటల ఉత్పత్తి సరిపోకపోవడం వలన సాంప్రదాయక ఆహార ధాన్యాలు (ఉదా .మొక్క జొన్న) మరియు ప్రోటీన్ సప్ప్లిమేంట్ (ఉదా: సోయాబీన్ మీల్, పొద్దు తిరుగుడు కేక్ మరియు జింజిలీ కేక్) కొరత ఏర్పడుతుంది. అందువల్ల, సాంప్రదాయేతర వ్యవసాయ-పారిశ్రామిక ఉప ఉత్పత్తులను దాణాలో వాడడం (unconventional feed resources) ఈ సమయంలో  అవసరం. ఇది ఫీడ్ లభ్యతను పెంపొందిస్తుంది మరియు మెరుగైన ఉత్పత్తి, పనితీరును సులభతరం చేయడం ద్వారా పశువుల పోషక అవసరాలను తీరుస్తుంది. ఈ కారణంగా పశు పోషకాహార నిపుణులు సంప్రదాయేతర వ్యవసాయ-పారిశ్రామిక ఉప ఉత్పత్తుల నుండి ఉపయోగకరమైన, ఆకర్షణీయమైన, చౌకైన మరియు తక్షణమే లభ్యమయ్యే ప్రోటీన్ మరియు శక్తి వనరులను పరిశోధించి మేతలో వాటి  వాడకం విలువలను తెలుపడమైనది.

ఇలాంటి సాంప్రదాయేతర ఉత్పత్తులలో పామ్ కెర్నల్ కేక్ (PKC) అనేది ఒకటి. పామాయిల్ వెలికితీత సమయంలో ఆయిల్ పామ్ (ఎలాయిస్ గినిన్సిస్) నుండి పొందిన వ్యవసాయ-పారిశ్రామిక ఉప ఉత్పత్తి. పామ్ ప్రెస్ ఫైబర్ (మీసోకార్ప్ పొర నుండి), ఖాళీ పండ్ల , ఆయిల్ పామ్ ట్రంక్ మరియు ఫ్రాండ్స్ వంటి అనేక ఇతర ఉప ఉత్పత్తులు కూడా ఆయిల్ పామ్ పరిశ్రమ నుండి వస్తాయి. ఈ ఉప-ఉత్పత్తులలో, పామ్ కెర్నల్ కేక్ (PKC)ను పామ్ కెర్నల్ మీల్ (PKM) అని కూడా పిలుస్తారు. పీచు స్వభావం కారణంగా అరలు పొట్ట కలిగిన పాడిపశువుల దాణాలో విస్తృతంగా వినియోగించవచ్చు. ఇది ఎక్కువ పరిమాణంలో పశువుల పోషణ కోసం సరసమైన ధరలలో లభిస్తుంది మరియు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.పామ్ ఆయిల్  కేక్ కేకులో 10-12% వరకు నూనె ఉంటుంది. సాల్వెంట్ ఎక్సట్రాక్షన్ పద్దతి ద్వారా నూనె వెలికి తీసినట్లయితే అందులో కొవ్వు శాతము 0.5-3% మాత్రమే ఉంటుంది . దీనినిడి-ఆయిల్డ్ పామ్ కెర్నల్ కేక్ (DPKC) అని అంటారు.

 

palm kernel cake

palm kernel cake

పామ్ కెర్నల్ కేక్ ను గుర్తించుట మరియు ఉత్పత్తి చేయుట : పామ్ కెర్నల్ కేక్ అనేది ఇండోనేషియా, మలేషియా మరియు నైజీరియావంటి ఉష్ణమండల దేశాలలో పామాయిల్ ఉత్పత్తి కేంద్రమునుండి చేయబడిన అగ్రో-ఇండస్ట్రియల్ఉత్పత్తి. ప్రపంచ వ్యాప్తంగా ఇండోనేషియా మరియు మలేషియా పామాయిల్ మరియు పామాయిల్ ఉప ఉత్పత్తులను అత్యధికంగా ఉత్పత్తి మరియు ఎగుమతి చేస్తున్నాయి.

product palm kernel cake

product palm kernel cake

పామ్ కెర్నల్ ఉప-ఉత్పత్తుల రసాయన కూర్పులో గణనీయమైన వైవిధ్యం ఉంది. పామ్ కెర్నల్ కేక్ (PKC) సాధారణ ప్రోటీన్ (మాంసకృత్తులు) మరియు శక్తి నిచ్చు దాణా దినుసుగా పరిగణించబడుతుంది. దీనిలొఅఫ్లాటాక్సిన్లు వుండవు.పామ్ కెర్నల్ కేక్ (PKC) మరియు ఉప ఉత్పత్తులు యొక్క నాణ్యత వాటిని తయారు చేసే  పద్దతిని బట్టి ఉంటుంది . పామ్ ఆయిల్ తొలగింపు మరియు మిగిలిన కాయలోని పదార్ధం యొక్క నిష్పత్తి ఆధారంగా ఈ నాణ్యత మారుతుంది. ఇందులో సాధారణ మాంసకృత్తులు మరియు శక్తి ఉండి రుచికరంగాఉండటం వలన పశువుల దాణా గా ఉపయోగపడుతుంది. ఇందులో పశువులకు అవసరమైన రాగి (కాపర్) 21-28ppm  ఎక్కువ ఉంటుంది.

PKC సాధారణంగా మాంసం కొరకు మరియు పాడి పశువులకు శక్తి వనరుగా ఉపయోగించబడుతుంది. PKC ఏడాది పొడవునా, సరసమైన తక్కువ ధరకు లభ్యమవటం వలన దీనిని పౌల్ట్రీ, పాడి మరియు పశువుల దాణాలో ప్రోటీన్‌కు  వనరుగా ఉపయోగించవచ్చు.

ఈ  PKC  లో మాంసకృత్తులు పెంచి జీర్ణము కాని పీచు వంటి fiber పదార్ధాలను తగ్గించటం కొరకు అనేక పరిశోధనలు చేసి DPKC ను తయారు చేయడం జరిగినది. ఇందులో 20% అధిక ప్రోటీన్ ఉంటుంది.

Also Read : పంట కోసం రైతు… రైతు కోసం కేసీఆర

పామ్ పళ్లలో గింజ 25-30% వరకు ఉంటుంది. విత్తనం పైన కాఫీ రంగులో గట్టిపెంకు(shell) ఉంటుంది. లోపల గింజ (kernel) ఉంటుంది. మొత్తం పండులో నూనె/కొవ్వుశాతం 25-30% వరకు, కేవలం గింజ/పిక్కలో 40% వరకు ఉంటుంది. పామాయిల్ మిల్‌ నుండి సేకరించిన పండ్లను గింజలను(nuts) మొదట శుభ్రంచేసి, ఆరబెట్టి తేమ శాతాన్ని 6-7% ఉంచి మొత్తం సీడును క్రష్‌ చేసినపుడు 14-16% నూనె దిగుబడి వస్తుంది, కేకులో 10 – 12% వరకు నూనె ఉంటుంది. పామ్‌కెర్నల్‌ కేకులో ప్రోటిన్‌ 16-18 % వరకు, డి్‌ఆయిల్డ్‌ కేకులో 19-20% వరకు ఉండటం వలన దీనిని పశువుల దాణాగా, కోళ్ళదాణాగా వుపయోగిస్తారు. పామ్ కెర్నల్ కేక్లో 16% ఫైబర్‌,  అధిక భాస్వరం, కాల్షియం నిష్పత్తిని కలిగి ఉంటుంది. మెగ్నీషియం, ఇనుము మరియు జింక్ వంటి ముఖ్యమైన మినరల్స్ ను కలిగి ఉంటుంది.

 పామ్ కెర్నల్ కేక్ యొక్క రసాయన కూర్పు : పామ్ కెర్నల్ కేక్ యొక్క రసాయన కూర్పు (ముడి, ప్రోటీన్, ముడి ఫైబర్, ఈథర్ సారం, బూడిద మరియు నైట్రోజన్ రహిత సారం) నమూనాల మూలాలను బట్టి, మట్టి రకం, నూనె వెలికితీత ప్రక్రియ (ఉదా, యాంత్రిక లేదా ద్రావణి వెలికితీత), మిగిలిన  ఎండోకార్ప్ మొత్తం మరియు కెర్నల్ నుండి చమురు వెలికితీత సామర్థ్యం బట్టి మారుతుంది.

కెమికల్ కంపొజిషన్

(Chemical composition )

శాతము %

(Percent %)

పొడి పదార్థం Dry Matter % 89.00-95.00%
శక్తి/ఎనర్జీ (Energy % kcal) 1,940- 2,490

కిలో క్యాలోరీలు  / కేజీ

ముడి ప్రోటీన్ (Crude Protein %) 14-20%
కొవ్వు శాతము (Crude Fat %) 5-12%
బూడిద (Total Ash %) 3.06 – 5.6%
కాల్షియం (Calcium%) 0.276%
ఫాస్ఫోర్ (Phosporus%) 0.645%
మెగ్నీషియం (Magnesium %) 0.158%
జింక్ (Zinc %) 0.214%
సోడియం (Sodium%) 0.187%
పొటాషియం (Potassium%) 0.365%
రాగి (Copper%) 0.25%
మాంగనీస్ (Manganese %) 1.3 ppm
ఇనుము(Iron%) 0.75 ppm

 

పాడి పశువుల దాణాలో పామ్ కెర్నల్ కేక్ చేర్చడం వలన –ప్రభావము / లాభాలు:-

పాల ఉత్పత్తి మరియు పశువుల సామర్ధ్యం పశువు తినే  ఆహారం పై ఆధారపడి ఉంటుంది. పాడి పశువుల నిర్వహణ ఖర్చులో 70% దాణా ఖర్చు ఉంటుంది. కనుక, పశువుల ఉత్పాదకతపై ఎటువంటి ప్రతికూల ప్రభావం లేకుండా చౌకైన శక్తి మరియు ప్రోటీన్ వనరులను చేర్చడం ద్వారా (పశువుల దాణా) ఖర్చును తగ్గించడానికి అగ్రో -ఇండస్ట్రియల్ ఉప-ఉత్పత్తులను ఉపయోగించడం చాలా ముఖ్యం. మొక్కజొన్న, పత్తి విత్తన కేక్ మరియు సోయాబీన్ కేక్ వంటి ఖరీదైన సాంప్రదాయిక ఫీడ్ పదార్థాలను పామ్ కెర్నల్ కేక్ భర్తీ చేయడం వలన పాల ఉత్పత్తి ఖర్చును సమర్థవంతంగా తగ్గిస్తుంది, ఇది పశువుల పోషక అవసరాలను తీర్చడమే కాక స్థానికంగా లభిస్తూ ఆర్థికంగా రైతులకు లాభదాయకంగా ఉంటుంది.

పై విషయాలను దృష్టిలో ఉంచుకుని, గేదెలకు అందించే  దాణామిశ్రమాలలో డి-ఆయిల్డ్ పామ్ కెర్నల్ కేక్ (DPKC) చేర్చడం వలన గేదెలకు, దున్న పోతులుకు, దూడలకు పెరుగుదల పాలిచ్చే గేదెల్లో పాల దిగుబడి మరియు పాల నాణ్యత పై ప్రభావితము ఉంటుంది.

దూడలు మరియు పాలిచ్చే గేదెలకు ఇచ్చే ఆహారంలో (DPKC) చేర్చడం ద్వారా దాణా ఖర్చును తగ్గించి నాణ్యమైన దాణా ను ఉత్పత్తి చేయవచ్చు. పామ్ కెర్నల్ కేక్ ను ఎక్కువ మోతాదులో దాణాలో చేర్చినట్లయితే అధిక ఫైబర్ కారణంగా అరుగుదల  తగ్గుతుంది. గేదె దాణాలో 30% పామ్ కెర్నల్ కేక్ చేర్చినపుడు అరుగుదల తక్కువ ఉంటుంది. మిశ్రమంలో DPKC ని 15% స్థాయిలో చేర్చడం వలన పెరుగుతున్న దూడలు మరియు పాలిచ్చే గేదెలు రెండింటిలో ఉత్పత్తి, పోషకాల జీర్ణశక్తి పెరిగిఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. దీని ఆధారంగా, సాంద్రీకృత మిశ్రమంలో DPKC ని 15% స్థాయిలో చేర్చవచ్చని నిర్ధారించవచ్చు. పెరుగుతున్న దూడలు మరియు పాలిచ్చే ముర్రా గేదెలు మరియు ఎదిగిన ఉత్పత్తి లేని గేదెల కోసం DPKC ని 30% స్థాయిలో దాణాలో వాడినట్లయితే ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా రైతులు / పాడి పారిశ్రామికవేత్తలకు లాభాలను అర్జించవచ్చు. ఈ విధంగాసమీకృత దాణా మిశ్రమంలో 15 నుండి 30 శాతం వరకు DPKC ని చేర్చినట్లయితే దాణా ఖర్చును ప్రతీ కేజీకి  రూ 1.60 పైసల నుండి రూ 3.50 పైసల వరకు తగ్గించవచ్చు.

గొఱ్ఱెలు మరియు మేకల దాణాలో పామ్ కెర్నల్ కేక్ వినియోగం : గొఱ్ఱెలు మరియు మేకలలో పిల్లలు, ఎదుగుతున్న జీవాలులో DPKC ని 10 – 20 శాతం వరకు కలపడం వలన  పోషకాల జీర్ణశక్తి  మెరుగుపడి శరీర బరువు 0.5-1 Kg వరకు పెరిగి, ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. పది మరియు చూడి జీవాల దాణాలో కూడా DPKC ని 10-15% వరకు వాడి లబ్ది పొందవచ్చు.

పందుల  ఆహారంలో పామ్ కెర్నల్ కేక్ వినియోగం : దాణా మిశ్రమంలో DPKC / పీకేసిని 30% వరకు చేర్చినట్లైతే పందాలు 0.5-0.7 kg బరువు పెరగడానికి మరియు దాణా ఖర్చు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

 కుందేలు  ఆహారంలో పామ్ కెర్నల్ కేక్ వినియోగం  : దాణా మిశ్రమంలో DPKC / PKC ని  30%  వరకు  మొక్కజొన్న సొయా ఉపయోగించిన దాణాలో కుందేళ్ళ ఎదుగుదల మరియు ఉత్పత్తి సామర్ధ్యముకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడవచ్చు   మరియు దాణాను ఖర్చు తగ్గించవచ్చు.

పౌల్ట్రీ ఫీడింగ్‌లో పామ్ కెర్నల్ కేక్ : DPKC / PKC ని పౌల్ట్రీ దాణాలో చేర్చడం గురించి అనేక శాస్త్రీయ నివేదికల అనుసారంగా   10% దాణాలో చేర్చడం ద్వారా బ్రాయిలర్ కోళ్ళలో అధిక బరువు, లేయర్ కోళ్ళలో గుడ్ల ఉత్పత్తిలో మెరుగు ఉంటుంది. బాతులలో 15% స్థాయి వరకు PKC ని దాణాలో చేర్చవచ్చు.

ముగింపు: పైన తెలియపరిచిన వివరాల ప్రకారము పామ్ కెర్నల్ కేక్‌/DPKC ని 15-30% వరకు పశువుల, గొర్రెల, మేకల, పందులు మరియు కుందేళ్ళ దాణాలో అలాగే 10-20 % వరకు కోళ్ల దాణాలో చేర్చడం వల్ల వాటి ఆరోగ్య స్థితిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకుండా పాడి పశువులలో, నాణ్యతతో కూడిన పాల ఉత్పత్తిని   పెంచుతూ ఇతర పశువులలో శారీరక ఎదుగుదల, ఉత్పత్తి సామర్ధ్యమును పెంచుతూ  దాణా ఖర్చును  నియంత్రించవచ్చు.

డా.సి అనిల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనిమల్ న్యూట్రిషన్) లీవెస్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్, ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల , గన్నవరం, కృష్ణ జిల్లా 521102

డా.టి. సుస్మిత, అసిస్టెంట్ ప్రొఫెసర్ (పౌల్ట్రీ సైన్స్) లీవెస్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్, ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల, గన్నవరం, కృష్ణ జిల్లా 521102  

 

Also Read : కిసాన్ మోర్చా కొత్త కమిటీ..

Leave Your Comments

పంట కోసం రైతు… రైతు కోసం కేసీఆర్

Previous article

ధాన్యం సేకరణలో ఎఫ్‌సీఐ జాప్యం…

Next article

You may also like