మన వ్యవసాయం

మినుములో తెగుళ్ళు – యాజమాన్యం

0
  1. కొరినోస్పొరా ఆకుమచ్చ తెగులు : ఈ తెగులు కొరినోస్పోరా కెస్సీకోలా అనే శిలీంధ్రము ద్వారా వ్యాపిస్తుంది.

   వ్యాధి లక్షణాలు : ఈ తెగులు సోకిన ఆకులపై చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అనుకూల వాతావరణ పరిస్థితుల్లో పెద్ద మచ్చలు వలయాకారంగా ఏర్పడి ఆకులు ఎండి రాలిపోతాయి.

 నివారణ : నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్ లేదా 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్లను 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

  1. ఎండు తెగులు (విల్ట్) : ఈ తెగులు ప్యూజేరియం అనే శిలీంధ్రము ద్వారా వ్యాపిస్తుంది.

 వ్యాధి లక్షణాలు : ఈ తెగులు ఆశించిన మొక్కలు వడలి, ఎండిపోతాయి. పంటకు అధిక నష్టం కలుగుతుంది. ఈ తెగులు, భూమిలో వున్న శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. తర్వాత ఈ మొక్కలు చనిపోతాయి. కాండం చీల్చి చూస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కన్పిస్తాయి.

     నివారణ : బుట్టమినుము, యల్ బిజి-462, యబిజి-611, యబిజి-22, యబిజి-648, 685, 709, 752 రకాలకు ఈ తెగులును తట్టుకునే శక్తి కలదు. కార్బండిజమ్ 2 గ్రా, కిలో విత్తనాన్ని కలిపి విత్తనశుద్ది చేయాలి.

  1. పక్షికన్ను తెగులు (ఆంత్రాక్నోస్) : కొల్లిటో ట్రైకమ్ లిండిముథియానమ్ ద్వారా వ్యాపిస్తుంది.

  వ్యాధి లక్షణాలు : ఈ తెగులు సోకిన ఆకులపై లేత పసుపు రంగు అంచులతో కూడిన చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి.

  నివారణ : ఈ తెగులు నివారణకు మాంకోజెబ్ 2.5గ్రా. లేదా హెక్సాకొనాజోల్ 2.0 మి.లీ. కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటరు నీటికి 3 గ్రా. చొప్పున 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

 

Black Gram

Black Gram ( మినుము పంట )

4. తుప్పు లేదా కుంకుమ తెగులు : ఈ తెగులు యూరోమైసిన్ ఎపెండిక్యులేటన్ అనే శిలీంధ్రము ద్వారా వ్యాపిస్తుంది.

  వ్యాధి లక్షణాలు : పైరు పూత దశలో ఈ తెగులు లక్షణాలు కనిపిస్తాయి. ఆకుల ఉపరితలం పైన లేత పసుపు వర్ణం గల గుండ్రని చిన్న మచ్చలు ఉంటాయి. పిమ్మట కుంభాకృతితో కూడిన గుండ్రని మచ్చలు కుంకుమ / తుప్పు రంగును పోలి ఉంటాయి.

  నివారణ : ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల మాంకోజెబ్+ 1 మి.లీ. డైనోకాప్ లేక 1 మి.లీ. ట్రైడిమార్చ్ లేక 1 గ్రా. బైలిటాన్ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

  1. సీతాఫలం తెగులు (లీఫ్ క్రింకిల్)  : ఇది వైరస్ జాతి తెగులు.

   వ్యాధి లక్షణాలు : ఈ తెగులు విత్తనం ద్వారా ఇంకా పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కల ఆకులు ముడతలుగా ఏర్పడి మందంగా పెద్దవిగా పెరుగుతాయి. మొక్కలు పూత పూయక వెర్రితలలు వేస్తాయి.

  నివారణ : పేనుబంక నివారణకు లీటరు నీటికి 2 మి.లీ డైమిథోయేట్ లేక 1.5 మి.లీ. మోనోక్రోటోఫాస్ ను కలిపి పిచికారి చేయాలి.

  1. పల్లాకు తెగులు (ఎల్లోమొజాయిక్) : ఇది జెమిని వైరస్ జాతి వలన వచ్చు తెగులు.

వ్యాధి లక్షణాలు : ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు కాయల మీద పసుపు పచ్చ మచ్చలు ఏర్పడతాయి. తొలిదశలో ఈ వైరస్ తెగులు ఆశించినట్లైతే పైరు గిడసబారిపోయి, పూత పూయక, ఎండిపోతుంది. ఈ వైరస్ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది.

   నివారణ : తెల్లదోమ నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేక ఎసిఫేట్ 1 గ్రాము లేక డైమిథోయేట్ 2 మి.లీ. లేక ఫాస్పోమిడాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి వారం నుంచి 10 రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారి చేసుకొనవలెను.

Also Read : జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవం…

 

                                          మినుము, పెసర, అలసంద

 

బూడిద తెగులు  :

కారకం : ఈ వ్యాధి ఎరిసిపై పాలిగోని అను శిలీంధ్రము ద్వారా వ్యాప్తి చెందుతుంది.

లక్షణాలు : సాధారణంగా పైరు పూత దశ చేరుకొనే సమయంలో ఈ తెగులు ఆరంభమవుతుంది. ఆకుల మీద తెల్లని బూడిద చల్లినట్లు చిన్న చిన్న మచ్చలు ఏర్పడి అవి క్రమేపి పెరిగి ఆకుబాగాన్నంత ఆక్రమిస్తాయి. వ్యాధి తీవ్రత పెరిగే కొలదీ ఆకు ఇరవైపులా బూడిదతో పూర్తిగా కప్పివేయబడును. ఆకులు పసుపు వర్ణానికి మారి ఎండి రాలిపోతాయి. కాయల సంఖ్య తగ్గి కాయల త్వరగా పక్వానికి వచ్చి గింజల పరిమాణం కూడా తగ్గుతుంది. ఈ తెగులు వ్యాప్తికి చల్లని పొడి వాతావరణము అనువైనది. గాలి ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుతుంది.

 

Black gram ( మినుములు )

నివారణ : ఈ తెగులు ఆశించిన వెంటనే, మరో 15 రోజుల వ్యవధిలో రెండవ సారి లీటరు నీటికి కార్బండిజం 1 గ్రా॥ లేదా థయోఫినేట్ మిథైల్ 1 గ్రా|| లేదా ట్రెడిమార్చ్ 1 మి.లీ. లేదా కెరాథేన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెగులు తట్టుకొనే రకాలను విత్తుకోవాలి

పెసర – జె.ఆర్.యు.ఎమ్. 1, పూస 9072, డబ్యూ .జి.జి 48, 62, టి.ఎ.ఆర్.ఎమ్.1,

మినుము – కృష్ణయ్య, ఎల్.బి.జి 623, టి.ఎమ్. 962

  1. పల్లాకు తెగులు :

లక్షణాలు : ఈ వ్యాధి ఎల్లో మొజాయిక్ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. ఆకులపై కాంతివంతమైన పసుపు మరియు ముదురు ఆకుపచ్చ రంగుతో కలిసిన పొరలు లేక మచ్చలు ఆకుల ఉపరితలంపై ఏర్పడి తర్వాత ఆకులు మెరుపుతో కూడిన కాంతివంతమైన పసుపు రంగుకు మారును. తెగుళు సోకిన మొక్కలు తక్కువ పూత కల్గి ఉండి తక్కువ కాయలను కల్గి ఉంటాయి. కాయలు కూడా పసుపు వర్ణంలోకి మారి గింజలు చిన్నవిగా ఉంటాయి. ఈ వైరస్ తెల్ల దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

నివారణ :

  1. ఈ వ్యాది వ్యాప్తికి కారణమైన తెల్లదోమ నివారణకై  డైమిధో ఏట్ లేక మోనోక్రోటోపాస్ లాంటి మందును పిచికారి చేయవలెను.

  2. ఈ వ్యాధిని తట్టుకొనే రకాలైన

మినుమ ఎల్.బి.జి. 20, పి.యు 31, ఎల్.బి.జి. 752, టి-9, టియు 94-2,

పెసర – ఎల్.జి.జి. 407, ఎమ్.ఎల్. 267, ఎల్.జి.జి.460, డబ్యూజి.జి 37

 

Also Read : ఎంత వ‌రిని ప్రొక్యూర్ చేస్తారో చెప్పాలి !

 

Leave Your Comments

ఎంత వ‌రిని ప్రొక్యూర్ చేస్తారో చెప్పాలి !

Previous article

పుట్ట గొడుగులు – పోషకాల గనులు

Next article

You may also like