Philippines firm takes over Telangana Dharani portal వ్యవసాయ భూముల రికార్డుల నిర్వహణకు సంబంధించి సీఎం కెసిఆర్ ధరణి పోర్టల్ ని తీసుకొచ్చారు. ధరణి పోర్టల్ లో భూములకు సంబంధించి డేటా నమోదైతే ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ మేరకు తెలంగాణ రైతులు లక్షలాది మంది తమ భూముల్ని ధరణిలో నమోదు చేసుకున్నారు. లక్షలాది మంది రైతుల భూముల వివరాలు ధరణిలో పొందుపర్చారు . అయితే ధరణి పోర్టల్ ని ఎవరు నడుపుతున్నారు అన్నది ప్రశ్న. లక్షలాది మంది రైతుల డేటా ప్రభుత్వం చేతుల్లోనే ఉందా?
ధరణి పోర్టల్ ని తెలంగాణ ప్రభుత్వం ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చిందని తెలుస్తుంది. అది కూడా దివాళా తీసిన కంపెనీకి అప్పజెప్పిందని తెలుస్తుంది. మరో విశేషం ఏంటంటే… ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీని పిలిప్పీయన్ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. ధరణి పోర్టల్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తున్నట్లు చెప్తున్నా.. అందులో వాస్తవం లేదని తెలుస్తుంది. ధరణిలో తమ పేర్లు లేవని, సర్వే నంబర్లు, భూముల విస్తీర్ణం మాయమైందని కొన్ని నెలలుగా వేలాది మంది తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో భూముల డేటా ప్రైవసీ ప్రశ్నార్థకంగా మారింది. Philippines Company
నిజానికి గతంలోనే ధరణి పోర్టల్ వినియోగం పై విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థల వెబ్ సైట్లను మెయింటేన్ చేస్తున్న సెంటర్ ఫార్ గుడ్ గర్ననెన్స్ , టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో, లాంటి బడా కంపెనీలకు ప్రాజెక్టు ఇవ్వకుండా ఐఎల్ఎఫ్ఎస్‌కు రికార్డుల నిర్వహణను అప్పగించడంపై మొదట్లోనే విమర్శలు వచ్చాయి. ఐఎల్ఎఫ్ఎస్ ప్రస్తుతం మన ధరణితో పాటు బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌లను నిర్వహిస్తోంది.
Dharani Portal ధరణి పోర్టల్ అంటే ప్రభుత్వమే నిర్వహిస్తుందని లక్షలాది మంది రైతులు తమ ప్రైవేటు వివరాలను ధరణిలో నమోదు చేశారు. కానీ లోతుగా చూస్తే ధరణి పోర్టల్ ని నడిపించేది ఒక బోగస్ కంపెనీ గా తెలుస్తుంది. ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ బ్యాంకులకు సుమారు రూ.99 వేల కోట్లు ఎగ్గొట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. రెండేళ్లుగా విడతలవారీగా అప్పులు చెల్లిస్తూ వస్తున్న ఈ సంస్థ.. ఇటీవల టెర్రాసిస్ టెక్నాలజీస్‌లోని 52.26 శాతం వాటాను రూ.1,275 కోట్లకు ఫిలిప్పీన్స్‌కు చెందిన ఫాల్కన్ గ్రూప్‌నకు అమ్మేసింది. అంటే మన భూముల రికార్డులు విదేశీ కంపెనీ చేతిలోకి వెళ్లినట్లే.