వార్తలు

రోబో రైతులు…

0
Robots in Agriculture

Robots in Agriculture and Farming టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ మానవ శ్రమ అవసరం లేకుండా పోతుంది. టెక్నాలజీతో ఏ పనైనా సులువుగా చేయడమే కాకుండా ఎంతో శ్రమ అదా అవుతుంది. ఇక పనిలో నాణ్యత పెరుగుతుంది. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించుకుని వ్యవసాయం చేస్తున్నారు. అన్ని రంగాల్లో టెక్నాలజీతో పనులు సులభతరం చేసుకుంటున్న ఈ రోజుల్లో వ్యవసాయంలో కూడా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ని ప్రవేశపెడుతున్నారు. వచ్చే రెండు మూడు దశాబ్దాల కాలంలో వ్యవసాయం చాలావరకు డిజిటల్ అయిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Robots in Agriculture

వ్యవసాయానికి రోబోలని పరిచయం చేసిన కొందరు రైతులు ( విదేశీ ) అద్భుతమైన ఫలితాలు చూస్తున్నారు. పంట వేసిన నాటినుండి పంట కోత వరకు అంత రోబోట్స్ చూసుకుంటాయి. కలుపు మొక్కలను గుర్తించి, వాటిని తొలగించేస్తుంది. కాగా ఈ తరహా రోబోట్ లు ప్రస్తుతం విదేశాల్లోనే వినియోగిస్తున్నారు. అవి మన దేశంలో అందుబాటులోకి వస్తే రైతుకి ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు నిపుణులు. ఇక రైతు పొలానికి వెళ్లాల్సిన పనుండదు. ఈ రోబోలను ఇంట్లో ఉండే ఆపరేట్ చేసుకోవచ్చు. మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తో కమాండ్ చేసుకోవచ్చు.

Robots in Agriculture

Robot Farming ఈ రోబో దానంతట అదే పంట పొలాల్లో తిరుగుతూ తన కెమెరాలతో మొక్కలను చిత్రీకరిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆ ఫొటోలను విశ్లేషించి మొక్కల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అంచనా వేస్తుంది. దాని ఆధారంగా రైతు పంటకు చీడపీడల గురించి, మొక్కలకు ఏయే పోషకాలు అవసరం అన్న విషయాలను తెలుసుకునే వీలుంటుందని నిపుణులు చెప్తున్నారు .ప్రస్తుతం యూకేలోని 25,000 ఎకరాల పంటచేలలో రోబోని ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. దీనికి అత్యాధునిక కెమెరాలు, సెన్సార్లు ఉంటాయి. ఏ భూమిలో ఏ ఎరువును, ఏ పంటకు ఎంత మోతాదులో వాడాలో ఇది చెప్పేస్తుందట. దీనివల్ల ఎరువులపై పెడుతున్న ఖర్చు 90 శాతం తగ్గుతుందని రోబో రూపకర్తలు చెబుతున్నారు.

Leave Your Comments

రైతులు బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దు…

Previous article

ప్రజల్లో చిరుధాన్యాలపై ఆసక్తి పెరుగుతోంది – PJTSAU ఉపకులపతి ప్రవీణ్ రావు

Next article

You may also like