Telangana Tenant Farmers Confused యాసంగి పంట కొనుగోలులో కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. రబీ సీజన్లో అనుకున్న దానికంటే ఎక్కువే కొన్నామని, యాసంగి పంట మాత్రం కొనుగోలు చేసే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేసింది. కాగా తెలంగాణ సర్కారు కూడా వెనక్కు తగ్గి ఇక యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని తేల్చి చెప్పింది. అయితే ఇప్పుడు యాసంగిలో ఏ పంట వేయాలో రైతులకు అర్ధం కాని పరిస్థితి. ముఖ్యంగా కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఎకరాకు పెట్టుబడి ముప్పై నుంచి 35 వేలు దాటుతుంది. ఈ పరిస్థితుల్లో యాసంగిలో వరి వేస్తే ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే పరిస్థితేంటి? ఒకవేళ తెగించి వరి సాగు చేస్తే దళారులకు లొంగాల్సిందేనా అంటూ రైతన్నలు మొరపెట్టుకుంటున్నారు. ఇక యాసంగి పంటలో ప్రత్యామ్నాయంగా ఏ పంట వేయాలో అర్ధం కావడం లేదంటున్నారు రైతులు. మరోవైపు పంట సాగుకు కౌలు రైతులు వెనకడుగేస్తున్నారు. దీంతో భూమి యజమానులు ధరలను తగ్గించేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దాదాపు ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి
కొన్ని ప్రాంతాల్లో వరి తప్ప ఇతర పంటలకు ఆస్కారం లేదు. మరి యాసంగిలో ఆ రైతులు ఏ పంట వేయాలి? వరిని సాగు చేస్తే ప్రభుత్వాలు కొననంటున్నాయి, దళారులేమో వారికి అనుగుణంగా ధరలు నిర్ణయిస్తూ ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర లేకుండా చేస్తున్నారని జిల్లాలోని రైతులు వాపోతున్నారు. దీంతో కౌలు రైతులు కొందరు వ్యవసాయానికి దూరమవుతున్నారు. దేశంలో, రాష్ట్రంలో కౌలు రైతులే ఎక్కువగా ఉన్న పరిస్థితి. కౌలు రైతన్నలు సాగుకు దూరమైతే నష్టం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. Telangana Tenant Farmers
Tenant Farmers Problems ఇక తెలంగాణలో వింత పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పంటని కొనుగోలు చేయమని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం మెడలు వంచి పంటను కొనుగోలు చేపిస్తామని అన్నది. కానీ ఇటీవల సీఎం కెసిఆర్ స్వయంగా ప్రకటన చేశారు. యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలుండవని స్పష్టం చేశారు. కాగా పార్లమెంటు సమావేశాల్లో మాత్రం తెరాస ఎంపీలు పంట కొనుగోలు చేయాలని ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్ధం కానీ పరిస్థితి తలెత్తింది. మరి ఇకనైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి కౌలు రైతులపై అధ్యాయనం చేసి తగిన సానుకూల చర్యలు తీసుకోవాలని వేడుకొంటున్నారు రైతులు. Tenant Farmers