వార్తలు

కోతుల బెడద నుంచి పంటను కాపాడేందుకు కమిటీ..

0
CS Somesh Kumar

CS Somesh Kumar Review Meeting On monkey menace తెలంగాణాలో కోతులు, అడవి పందుల బెడద ఎక్కువైంది. దీంతో పంట తీవ్రంగా నష్టపోతుందని రైతులు మొరపెట్టుకుంటున్నారు. ఇదే విషయం ఇటీవల జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో కోతుల బెడద నివారణకై చేపట్టాల్సిన చర్యలు సూచించాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్​ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీస్ సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.

CS Somesh Kumar

CS Somesh Kumar కోతులు , అడవి పందుల నుంచి పంటలు దెబ్బతినకుండా కట్టడి చర్యలపై సోమేశ్ కుమార్ అధికారులతో చర్చించారు. ఇతర రాష్ట్రాలు ఈ సమస్యకు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై ఓ కమిటీ వేయడం జరిగింది. అటవీ, పశుసంవర్ధఖ, వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కోతుల బెడద నివారణకై కోతులకు సంతాన నిరోధక ఆపరేషన్ల నిర్వహణ, పునరావాస కేంద్రాల ఏర్పాటు, మరిన్ని ఆపరేషన్ నిర్వహణ కేంద్రాల ఏర్పాటు, తగిన సౌకర్యాల కల్పన తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అధికారులు, నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ… వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలపై అధ్యయనం చేసి వారం రోజుల్లోగా తగు ప్రతిపాదనలు సమర్పించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.

monkey menace

కోతులనుండి పంటను కాపాడేందుకు పలు సాంప్రదాయక విధానాలపై రైతులు, పౌరులను చైతన్య పరచాలని సీఎస్ ఆదేశించారు. పంటలను కాపాడుకునేందుకు అవలంభించాల్సిన నూతన విధానాలను రైతులకు సూచించాలన్నారు. ఈ సమీక్షా సమావేశానికి అటవీ, వ్యవసాయ, పంచాయతీరాజ్‌, పురపాలక శాఖ అధికారులతో పాటు వ్యవసాయ, పశుసంవర్ధక యూనివర్సిటీల వీసీలు హాజరయ్యారు.

monkey, wild boar menace

Leave Your Comments

నారాయణమూర్తి ‘రైతన్న’ సినిమా చూసిన మంత్రి..

Previous article

ఆ చర్యతో.. వ్యవసాయానికి దూరమవుతున్న కౌలు రైతులు

Next article

You may also like