-
యాసంగి పంట కొనుగోలుపై గందరగోళం
-
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతులు డైలమా
-
యాసంగి పంటపై నో క్లారిటీ
-
ధాన్యం కొనుగోలు చేయం : కేంద్రం
-
ధాన్యం లెక్క తేలుస్తాం: తెరాస
MP Keshava Rao Demands To Centre ఇటీవల ప్రారంభమైన శీతాకాల సమావేశాలు వాడివేడిగా నడుస్తున్నాయి. ప్రతిపక్షాల డిమాండ్లతో సభ దద్దరిల్లుతుంది. ఓ వైపు రైతు సమస్యల పరిష్కారం, మరోవైపు మద్దతు ధరపై విపక్షాలు గళం విప్పుతున్నారు. ఇక తెరాస ఎంపీలు సైతం లోకసభలో నినాదాలు చేస్తూ సభకు అడ్డుపడుతున్న వైనం. అయితే తెలంగాణ ఎంపీలు మాత్రం ధాన్యం కొనుగోలు చేస్తామన్న స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ ఆందోళనలు విరమించుకునే ప్రసక్తే లేదంటున్నారు. ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత కే కేశవరావు స్పష్టంచేశారు. ధాన్యం సేకరణపై గందరగోళానికి సభలోనే తెరపడాలని, కేంద్ర వ్యవసాయ మంత్రి దీనిపై సభలో ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేగాక ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలన్నారు. తాము ప్రతిపక్షంతో ఉన్నామని, రాజ్యసభలో 12 మంది విపక్ష పార్టీల సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత కే కేశవరావు కోరారు. Paddy Procurement
Telangana Agriculture News తెలంగాణ యాసంగి పంట కొనుగోలు అంశంలో తెరాస బీజేపీ ప్రభుత్వాల మధ్య పరస్పర విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. యాసంగి పంట కొనుగోలు చేయబోమని కేంద్రం తేల్చి చెప్పింది. కాగా పంట కొనుగోలు చేయాల్సిందేనని తెలంగాణ గవర్నమెంట్ డిమాండ్ చేస్తుంది. కేంద్రం కొనుగోలు చేయని ధాన్యాన్ని రాష్ట్రం ఎలా కొనుగోలు చేస్తుందని రాష్ట్ర నాయకత్వం ప్రశ్నిస్తుంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏళ్ళ తరబడి నిల్వ ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఆ అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదని రాష్ట్రం భావిస్తుంది. యాసంగి పంట కొనుగోలు విషయంలో కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తుందని సీఎం కెసిఆర్ మండిపడ్డారు. అందులో భాగంగా ధాన్యం కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ ఎంపీలతో నిరసనలకు పిలుపునిచ్చారు.
MP Keshava Rao ఇటీవల మొదలైన శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం మొండి వైఖరిని కడిగిపారేయాలని సీఎం కెసిఆర్ ఇప్పటికే ఎంపీలకు సూచించారు. అందులో భాగంగా తెరాస ఎంపీలు లోకసభలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులతో కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇటీవల సీఎం కెసిఆర్ యాసంగి పంట కొనుగోలు కేంద్రాలు ఉండవని క్లారిటీ ఇచ్చారు. ఓ వైపు ఎంపీలు ధాన్యం కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాలు ఉండవంటూ సీఎం స్పష్టం చేశారు. దీంతో రైతులు అయోమయంలో పడిపోతున్నారు. ఇంతకీ ధాన్యం కొంటారా లేదా? యాసంగిలో ఏ పంట వేయాలి అన్న డైలమాలో రైతన్నలు ఉన్నారు ప్రస్తుతం. parliament winter session 2021