Telangana Farmers Confused On Yasangi ఏడాది పొడవునా రైతులు ఎదో ఒక సమస్యను ఎదుర్కోవాల్సిందే. అకాల వర్షాలతో పంట నాశనం అవ్వడం, మద్దతు ధర లేకపోవడం, దళారుల చేతుల్లో నలిగిపోవడం ఇలా ఎదో ఒక రూపాన రైతులకు ఆటంకం ఎదురవుతూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యాసంగిలో ఏ పంట వేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు రైతులు. గతేడాది ప్రభుత్వ అధికారులే వరిని సాగు చెయ్యాలని ఆదేశించాయి. కాగా ఈ ఏడాది మాత్రం వరికి ప్రత్యామ్నాయ పంటలు చూసుకోవాలని ఆదేశిస్తుంది. మరోవైపు ప్రతిపక్షాల ఛాలెంజ్ లు రైతుల్ని కలవరపెడుతున్నాయి. వరి వెయ్యండి, రాష్ట్ర ప్రభుత్వమే ఆ వరిని కొనుగోలు చెయ్యాలంటూ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారు. కాగా ప్రత్యామ్నాయ పంటలవైపు చూస్తే.. మద్దతు ధర విషయంలో ప్రభుత్వాలు రోజుకొక మాట మాట్లాడుతున్నాయి. దీంతో రైతులు అయోమయంలో పడిపోయారు.
Telangana Paddy Issue అంతేకాకుండా వడ్లు వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సరిపడా అందుబాటులో లేకపోవడం, మద్దతు ధరపై స్పష్టత కరువవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగిలో వ్యవసాయం ఎలా చెయ్యాలో, ఏయో పంటలు సాగుచెయ్యాల్లో తేల్చుకోలేక అన్నదాతలు సతమతమవుతున్నారు.గతంలో వర్షాలు కురవక రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఈ ఏడాది పుష్కలంగా నీటి వసతి ఉంది. పుష్కలమైన నీటి వసతి కారణంగా వరి పంట సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. యాసంగి వరి సాగు వడ్లు కొనుగోలు చేయకుండా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. దీంతో తెలంగాణ రైతులు ఆగమాగం అవుతున్నారు.
మరోవైపు వరి పంటను ఎఫ్ సీఐ లేదా సివిల్ సప్లయ్స్/ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేయకపోతే మిల్లర్లు కనీస మద్దతు ధరలో 60 శాతం కూడా ఇవ్వకుండా తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం రూ.1940 కనీస మద్దతు ధర ప్రకటించగా.. మిల్లర్లు రూ.1,200 నుంచి 1,300 మాత్రమే ఇచ్చే పరిస్థితి దాపురించబోతున్నది. మొత్తంగా తెలంగాణాలో పొలిటికల్ బౌండరీలో రైతు బంతిలా మారాడు. Telangana Farmers Confused On Political Game