CM YS Jagan Visits Gosala at his House Tadepalli ఏపీ సీఎం వైస్ జగన్ ఇంట్లో కొత్తగా గోశాలను ఏర్పాటు చేశారు. ఆరు రకాల దేశీ ఆవులతో ఏర్పాటు చేసిన గోశాలను పూర్తిగా వెదురు, రాతితో నిర్మించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గోశాలను సీఎం సందర్శించారు. కొత్తగా ఏర్పాటు చేసిన గోశాలలో కలియదిరిగారు సీఎం జగన్. ప్రేమగా ఆవుల దెగ్గరకెళ్ళి ఆప్యాయంగా నిమురుతూ చిన్నపిల్లాడిలా మారిపోయారు.
CM YS Jagan ఎంతో అందంగా నిర్మించిన ఆ గోశాల ఆరుబయట గోవులు నీరు తాగేందుకు కొలను, పచ్చికబయళ్లను ఏర్పాటు చేయడంతో పాటు, పచ్చని చెట్లను కూడా నాటడంతో చూడచక్కగా ఉంది. చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న గోశాలను ఆసక్తిగా తిలకించారు సీఎం జగన్.ఇక గోశాల ఏర్పాట్లు, నిర్మించిన తీరు, సంరక్షణ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా ఉన్నారు. సీఎం నివాసం వద్ద ఏర్పాటు చేసిన గోశాలలో కపిల, గిర్, పుంగనూరు, కాంక్రిజ్, తార్ పార్కర్, సాయివాలా జాతి దేశీ ఆవులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గోశాల ఏర్పాటుపై తమతమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. Gosala In CM Jagan House