TS : తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం. హరితహారం 2015 జూలై 3న చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుచే అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో మొత్తంలో తెలంగాణ భూభాగంలో 33% మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. 2016లోనే 46 కోట్ల మొక్కలు నాటబడ్డాయి. హరితహారంలో రాష్ట్రంలో మొత్తం 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2021 మే వరకు దాదాపు 217 కోట్ల మొక్కలను అడవుల పునరుద్ధరణతో కలుపుకొని నాటడం జరిగింది.
ఇందుకోసం రూ.5,230 కోట్లు ఖర్చు చేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా హరిత హారం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఆరో దశలో 30 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో గ్రామాలు, పట్టణాల్లో ఎక్కువగా మొక్కలు నాటగా.ఈసారి అడవుల్లో ఎక్కువ మొక్కలు నాటే ప్రణాళికలు రూపొందించారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రమంతటా 1.20 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం పెట్టుకుంది. దేశంలోనే హైదరాబాద్ రాష్ట్రాన్ని పచ్చని ప్రకృతి గల సౌందర్యవన ప్రదేశంలా తీర్చి దిద్దాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ హరితహారాన్ని వివిధ దశలలో కార్యక్రమాలు చేపడుతున్న్నారు. హరితహారం 8వ దశలో భాగంగా 1.20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు GHMC అధికారికంగా తెలిపింది. ఈ మేరకు 600 నర్సరీల్లో 20 రకాల జాతుల మొక్కల పెంపకాన్ని చేపడుతున్నట్లు వెల్లడించింది. ఈ మొక్కలను పెద్ద సంచుల్లోకి మార్చి రాబోయే వానాకాలం నాటికి మూడు అడుగులకు పైగా ఎత్తు పెంచనున్నట్లు పేర్కొంది. ఏపుగా పెరిగే చెట్లను రోడ్లకు ఇరువైపులా, పార్కులు, శ్మశానవాటికలు, చెరువు గట్లపై నాటనున్నట్లు పేర్కొంది.
Also Read : రైతన్నకు షాక్.. పంట కొనం – సీఎం కేసీఆర్