UP Govt దేశానికి అన్నంపెట్టే రైతన్న బాగుంటేనే దేశం పదికాలాల పాటు పచ్చగా ఉంటుంది. కానీ నేడు పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయి. దేశంలోని అన్ని రంగాలు ముందుకు దూసుకెళ్తున్నప్పటికీ వ్యవసాయ రంగం మాత్రం డీలా పడిపోతుంది. అకాల వర్షాలు, పంటకు పురుగు పట్టడం, ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడం సమస్య ఏదైనా కావొచ్చు ఆ ప్రభావం మాత్రం రైతుపై విపరీతంగా పడుతుంది, దీంతో రైతు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు వ్యవసాయంపై అందరిలోనూ కాసింత అవగాహన మొదలైంది. రైతు బాగుంటేనే మనం బాగుంటం అన్నది కరోనా మనకు నేర్పిన గుణ పాఠం. ఇక ప్రభుత్వాలు కూడా వ్యవసాయంపై ద్రుష్టి సారించాయి. రైతుల కోసం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలపై వారికీ అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నాయి. తాజాగా యూపీ గవర్నమెంట్ రైతులకు అవగాహన కల్పించే దిశగా అడుగులు వేస్తుంది.
రైతుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త సంస్కరణలకు బీజం వేస్తుంది. తాజాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ( cm yogi adityanath ) సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. పంటల బీమా పథకం అయిన ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన రైతులందరికీ అందాలని, అందులో భాగంగా డిసెంబర్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా డ్రైవ్ నిర్వహించనుంది. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు మరియు వ్యాధుల కారణంగా పంట నష్టపోయినప్పుడు రైతులకు ఆర్థిక సహాయం అందించే ఈ బృహత్తర పథకాన్ని రైతులకు చేరవేసే దిశగా అడుగులు వేయాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు వాణిజ్య బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా ఆర్థిక సంస్థల సమన్వయంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వారం రోజుల పాటు ఈ డ్రైవ్‌ను కొనసాగించనుంది. Pradhan Mantri Fasal Bima Yojana