Telangana Cabinet Meeting On Monday తెలంగాణాలో యాసంగి పంట వరి కొనుగోలు విషయంలో అధికారపార్టీ కేంద్రంతో పలుమార్లు భేటీలు నిర్వహించింది. పంట కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరింది. కాగా.. వరి ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తే లేదంటూ కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం వరి కొనుగోలు విషయంలో అయోమయంలో పడింది. కాగా ఇదే అంశంపై సీఎం కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకు వరి పంట కొనుగోలు, యాసంగి పంట సాగు తదితర విషయాలపై చర్చించేందుకు క్యాబినెట్ భేటీ నిర్వహించనున్నారు. రేపు సోమవారం తెలంగాణ మంత్రులతో సీఎం కెసిఆర్ భేటీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. CM KCR