YS Sharmila Fires on CM KCR తెలంగాణాలో వరి ధాన్యం కొనుగోలు అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా రైతులు కనిపించని పరిస్థితి. ఈ విషయంలో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైపోతోంది. తెరాస బీజేపీ ప్రభుత్వాలు ఇప్పటికే విమర్శలతో కూడిన కామెంట్లతో పబ్బం గడుపుతున్నారు. ధాన్యం సేకరణపై కేంద్రం స్పష్టమైన వైఖరి ఏంటో అర్ధం కానీ పరిస్థితి. కాగా కేంద్రం మెడలు వంచైనా ధాన్యం కొనిపిస్తామంటుంది రాష్ట్ర ప్రభుత్వం. గత కొద్దిరోజులుగా ఈ తతాంగం అంతా రైతులు గమనిస్తూనే ఉన్నారు. కాగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో జాప్యంపై వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల సీరియస్ అయ్యారు.
సర్కారు తీరుకు ఆగ్రహించి కొందరు రైతన్నలు తమ పంటలు తగులబెట్టుకుంటున్నారని.. మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల అన్నారు. ఎవడు చస్తే తమకేందని ప్రభుత్వం చేతులెత్తేసిందని, కేసీఆర్ ధాన్యం కొనకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. వడ్లు కొనకపోతే కాలర్ పట్టుడు పక్కా, అధికారానికి నిప్పు పెట్టుడు పక్కా అని కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. వడ్లు కొనకుండా రైతన్నలపై సర్కారు పగపడుతోందని, తరుగు పేరిట మిల్లర్లు దోచుకుంటున్నారని ఆమె ట్వీట్ చేశారు.
అయితే ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో చర్చించేందుకు రాష్ట్ర మంత్రులు మరోసారి ఢిల్లీ పర్యటన చేపట్టారు. నేడు మంత్రి కేటీఆర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మరియు ఇతర మంత్రులు కలిసి ఢిల్లీకి వెళ్లారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో మరోసారి చర్చించనున్నారు. Paddy procurement