వార్తలు

సీఎం జగన్ నిర్ణయంతో అందుబాటు ధరల్లో టమోటా

1
cm jagan

CM Jagan Orders Officials To buy Tomatoes గత నెల రోజులుగా భారీ వర్షాలు, వరదలతో టమాటా పంటకు అపార నష్టం వాటిల్లింది. వర్షాలు, వరదల వల్ల పంటలు దెబ్బతినడం, కార్తీకమాసం కారణంగా డిమాండ్‌ వల్ల టమాటా ధర అందనంత ఎత్తుకు ఎదిగింది. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. అటు రైతులు నష్టపోకుండా, ఇటు వినియోగదారులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది.

CM Jagan

CM YS Jagan నెలక్రితం టమోటా ధరకు, ఇప్పుడున్న ధరకు కొండకు, నేలకు ఉన్నంత వ్యత్యాసముంది. కిలో పది రూపాయల ధర పలికే టమోటా ఒక్కసారిగా రూ.130 కి చేరింది. అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గడం, రవాణా సమస్యలతో టమోటాకు రెక్కలొచ్చాయి. కాగా టమోటా విషయంలో ఏపీ ప్రభుత్వం హర్షించదగ్గ నిర్ణయం తీసుకుంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో మార్కెటింగ్‌ శాఖ నేరుగా రైతుల నుంచి టమాటాలను కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయాలు చేపట్టింది. అనంతపురం, చిత్తూరు మార్కెట్‌ యార్డుల్లో రైతుల నుంచి కిలో రూ.50–55 చొప్పున కొనుగోలు చేసి వైఎస్సార్‌ కడప, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రైతు బజార్ల ద్వారా రవాణా చార్జీలతో కలిపి రూ.60 చొప్పున విక్రయిస్తోంది.

tamota price hike

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక్కో వినియోగదారుడికి కేవలం కిలో టమోటా అందించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను తగ్గించేందుకు ప్రస్తుతం రోజుకు ఏడు నుంచి 10 టన్నుల చొప్పున కొనుగోలు చేస్తుండగా రానున్న రోజుల్లో కనీసం వంద టన్నులు రైతుల నుంచి సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 61,571 హెక్టార్లలో టమాటా సాగవుతుండగా చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనే 56,633 హెక్టార్లలో పండిస్తున్నారు. ఏటా మొత్తం 22.16 లక్షల టన్నుల దిగుబడుల్లో 20.36 లక్షల టన్నులు మూడు జిల్లాల నుంచే వస్తున్నాయి. Tamota Price In AP

tamota

ఇక ఇప్పటికే టమోటా విషయంలో ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. నిన్నటికి నిన్న తమిళనాడు సీఎం స్టాలిన్ CM Stalin  టమోటా ధరలకు చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. రైతుల వద్ద టమోటా కొనుగోలు చేసి ప్రభుత్వ మార్కెట్లో రూ. 70 ధరకే అమ్మకం చేపట్టాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. కాగా సకాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల మరో వారం రోజుల్లో టమాటా ధరలు కిందకు దిగొచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో కిలో రూ.30–40కి దిగి వస్తుందని అంచనా వేస్తున్నారు.ప్రభుత్వ చర్యలతో రానున్న వారం రోజుల్లో ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయి.

Leave Your Comments

వరి కొనుగోలుపై మరోసారి ఢీల్లీకి…

Previous article

వడ్లు కొనకపోతే అధికారానికి నిప్పు పెట్టుడే…

Next article

You may also like