వార్తలు

వరి కొనుగోలుపై మరోసారి ఢీల్లీకి…

0
KTR Niranjan Reddy

యాసంగి వరి పంట కొనుగోలు అంశం గత కొద్దిరోజులుగా హాట్ టాపిక్ గా మారుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్, బృందం ఢిల్లీ పర్యటన చేపట్టాయి. అయితే నాలుగు రోజులు ఢిల్లీలో ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. సీఎం కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కరువైంది. దీంతో కేసీఆర్ బృందం తిరిగి హైదరాబాద్ చేరుకుంది. కాగా నేడు మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మరియు బృందం ఢిల్లీకి వెళ్లనున్నారు.

ktr niranjan reddy

గత పర్యటనలో భాగంగా ధాన్యం కొనుగోలుపై 26న తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కేటీఆర్ బృందంతో చెప్పగా..అందులో భాగంగానే నేడు ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తుండగా మంత్రులిద్దరూ దానికి హాజరుకానున్నారు. ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, మహమూద్‌ అలీ, సీహెచ్ మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌తో కూడిన బృందం నేడు ఢిల్లీలో చర్చలు జరుపుతారు. KTR

Leave Your Comments

ఐదవ అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్ర కాంగ్రెస్ సదస్సు 3వ రోజు

Previous article

సీఎం జగన్ నిర్ణయంతో అందుబాటు ధరల్లో టమోటా

Next article

You may also like