మన వ్యవసాయం

కందిలో తెగుళ్ళు – యాజమాన్యం

3
RED GRAM

1. ఎండు తెగులు : ఈ తెగులు ప్యుజేరియం ఉడమ్ అనే శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది.

 

Dry rot

Dry Rot ( ఎండు తెగులు )

వ్యాధి లక్షణాలు :  ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కాని మొక్కలో కొంత భాగం గాని వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి.

నివారణ : ఈ తెగులు అధికముగా కనిపించిన పొలాల్లో పొగాకు లేక జొన్నతో పంట మార్పిడి చేయాలి. ఐ.సి.పి.యల్ 87119 మరియు ఐ.సి.పి.యల్ 8863 అనే కంది రకాలు ఈ తెగులును తట్టుకొంటాయి.

Also Read : పశువులకు పుష్టి – హెర్బల్ మిక్చర్

2. వెర్రికుళ్ళు తెగులు (స్టెరిలిటి మొజాయిక్ ) : ఇది వైరస్ తెగులు

crazy rot ( వెర్రికుళ్ళు తెగులు )

వ్యాధి లక్షణాలు : తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులను విపరీతంగా తొడుగుతుంది పూత పూయదు.  ఈ తెగులు నల్లి మైట్స్ ద్వారా వ్యాపిస్తుంది.

నివారణ : లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకపు పొడి లేక 4 మీ.లీ కెలోదీన్ ను కలిపి వారానికి కొకసారి రెండు దఫాలు పిచికారి చేయాలి. ఈ తెగులును తట్టుకోగల ఐ.సి.పి.యల్  87119, ఐ.సి.పి.యల్ 85063, ఐ.సి.పి.యల్ .853,  బి.యస్.ఎమ్.ఆర్ .736 రకాలను సాగుచేయాలి.

  1. మాక్రోఫోనియా ఎండు తెగులు : ఈ తెగులు మాక్రోఫోనియా అనే శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది.

వ్యాధి లక్షణాలు : ముదురు మొక్కల కాండం పైన నూలు కండె ఆకారం కలిగిన గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు చుట్టూ గోధుమ వర్ణంలోనూ మధ్య భాగం తెలుపు వర్ణంలోనూ ఉంటాయి. తెగులు సోకిన మొక్కలు ఎండిపోతాయి. ఒక్కొక్కప్పుడు కొన్ని కొమ్మలు మాత్రమే ఎండి పోతాయి. యం.ఆర్.జి. 66 కంది రకం ఈ తెగులును తట్టుకొంటుంది. ఈ తెగులు నివారణకు పంట మార్పిడి పాటించాలి.

Macrofomina dry rot ( మాక్రోఫోమినా ఎండు తెగులు )

 

Also Read : చెదలు – నివారణ చర్యలు

Leave Your Comments

విటమిన్ C తో ఆరోగ్యం మీ వెంట !

Previous article

టమోటా ధరలపై సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం

Next article

You may also like