ఆహారశుద్దిమన వ్యవసాయం

లేట్ ఖరీఫ్ లో అనువైన అలసంద పంట సాగు వివరాలు

1

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మూడు పువ్వులు ఆరు కాయలు మాదిరిగా ఉంది. నిరంతర పంటల సాగులో రైతన్నలు నిమగ్నమై వున్నారు. ప్రస్తుత సాగులో వరి, ప్రత్తి ఎక్కువ మోతాదులో అదే విధంగా కంది ,మిరప,మొక్కజొన్న పంట సాగు ఒక మోస్తరుగా సాగు చేయడం జరిగింది. పప్పు ధాన్యపు పంటలు రైతులు స్వల్ప మోతాదులో సాగు చేపట్టారు. కొంత మంది రైతులు పలు కారణాల వల్ల విస్మరించారు. ఏది ఏమైనా కాలంతో పాటు రైతు సోదరులు నడవటమే మంచిదని వారి భావన. ఈ వ్యవసాయంలో ప్రగతి మరియు అభివృద్ది చెందాలంటే అన్ని కోణాలతో పురోగతి చెందిచాల్సిందే.

bobbarlu

bobbarlu ( అలసంద )

Also Read : కందిలో తెగుళ్ళు – యాజమాన్యం

అలసందలు మన రాష్ట్రములో వర్షాధారంగా వర్షాలు ఆలస్యమైనప్పుడు అడఫాదడఫా వానలు కురుస్తున్నప్పుడు , మరియు పంటల సరళిలో మిగులు ఉపయోగించుకుని కూడా పండిస్తుంటారు. ప్రస్తుత  సమయం కొద్దిగా ఉడుకు వాతావరణం కల్గి ఉంటున్నది కాబట్టి అలసంద పంట సాగుకే మరియు  ఏపుగా పెరుగుదలకే ఉపయోగపడుతుంది. వర్షాలు తగ్గుముఖంగా ఉన్నప్పుడు విత్తుకోవటం శ్రేయస్కరము.

Alasanda crop ( అలసంద )

నేలలు :- తేమను పట్టివుంచే గుణము కలిగి మురుగు నీరు నిల్వని మధ్యస్థ చల్కా నేలలు, ఎర్ర భూములు మరియు నల్ల రేగడి నేలలు అనుకూలంగా వుంటాం.

అనువైన సమయం :- మిగులు తేమ ఆధారంగా లేట్ ఖరీఫ్ లో, జోరుగా వర్షాలు కురుస్తున్నపుడు వేయకుండా ఖరీఫ్ లో ఆలస్యంగా విత్తినప్పుడు సెప్టెంబర్ లో విత్తుకోవచ్చు.

విత్తన మోతాదు :- విత్తనం లేదా పచ్చి కాయ కోత కోసం విత్తినప్పుడు 10 కిలోలు , పశుగ్రాసం లేదా పచ్చి రొట్టకై విత్తినప్పుడు 14 కిలోల విత్తనం సమకూర్చుకోవాలి.

రకాలు :- దేశీ రకాలు లేదా ఆయా ప్రాంతాలలో ఎక్కువగా దిగుబడినిచ్చే లోకల్ రకాలను ఎన్నుకొని విత్తుకోవచ్చు. అలా కాకుండా ఎక్కువ దిగుబడినిచ్చేందుకు మేలైన రకాలను ఎన్నుకోవాలి. పంటకాల పరిమితి,దిగుబడి మరియు లక్షణాలను గుర్తించుకొని ఎంచుకోవాలి.

కో – 4 , వి -240, జి.సి – 3 రకాలు ఇంచు మించుగా 90 – 100 రోజుల పంట కాలం ఉంటుంది. దిగుబడి ఎకరానికీ 5 క్వింటాళ్ళు ఇస్తాయి. ఇక లక్షణాలు చూస్తే స్వల్ప కాలికలు, తెగుళ్ళను తట్టుకొని అధిగమిస్తాయి.

విత్తే దూరం :- గుబురు రకాలు సాలుకు మధ్య 30 సెం.మీ మొక్కల మధ్య 10 సెం.మీ, బాగా కొమ్మలు వేసేవి మరియు తీగ రకాలు – సాళ్ళ మధ్య 45 – 60 సెం.మీ , మొక్కల మధ్య 15 సెం .మీ దూరంలో విత్తుకోవాలి. గుబురు రకాలు ఎకరానికే  1,33,333 మొక్కలు వస్తాయి. తీగ రకాలు 44,444 వచ్చేలా విత్తుకుంటే మంచిది.

విత్తే పద్ధతి :- నాగలి, కల్టివేటర్, సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్ లేదా గ్రీజరుతో ఎద బెట్టి సాళ్ళ పద్ధతిలో విత్తుకోవాలి.

సమగ్ర కలుపు యాజమాన్యం : – పెండి మిథాలిన్ 30 శాతం ఎకరాకు 1.30 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని లేదా మరుసటి రోజు గాని పిచికారి చేయాలి.

అంతర కృషి :- విత్తిన 30 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. అవసరాన్ని బట్టి సాళ్ళ మధ్య నాగలి లేదా దంతే తోలి కలుపు నివారించుకోవాలి. మొక్కల మధ్య కలుపును శ్రామికుల ద్వారా తీయించి ఆ తరువాత బోదె రూపంలో చేస్తే శ్రేయస్కరంగా వుంటుంది.

సమగ్ర ఎరువుల యాజమాన్యం :- ముఖ్యంగా తక్కువ వ్యయంతో వున్న వనరులతో పంట పండించుకోవాలి. సేంద్రియ ఎరువులను చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ముందు పంట మోళ్ళను రోటవేటరు తో భూమిలో కలియదున్నాలి. దీని వలన సేంద్రీయ  కర్భనం నేలకే సమకూరుతుంది.

కోసిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు:- కోసిన పంటను 3 – 4 రోజుల వరకు పంట చేనులో గాని లేదా కల్లెం పై ఎందనిచ్చి ఆ తర్వాత కర్రలతో కొట్టి గాని, పశువు తొక్కించి లేదా ట్రాక్టర్ తో తొక్కించి నూర్పిడి చేయాలి.

నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరచి, 2 – 3 రోజులు బాగా గింజలలో తేమ 9 శాతం కన్నా మించకుండా చూసుకొని నిల్వ చేయవలెను. గృహ అవసరాలకై కొద్ది మొత్తంలో నిల్వ చేసేటప్పుడు వంట నూనెలు  లేదా  ఆముదం నూనె లేదా వేప నూనె ప్రతి కిలో గింజలకు 5 .0 మీ.లి. చొప్పున కలిపి నిల్వ చేసినచో నిల్వలో పురుగుల వలన నష్టం నివారించవచ్చును. గ్రుడ్డులు పొదగకుండా నివారించబడి లార్వా గింజలలో చొరబడక ముందే చనిపోవడానికి దోహదపడును.

అలసంద సాగుకే పైన చెప్పిన సాగు వివరాలను మరియు శాస్త్రవేత్తల సలహాలు ,సూచనలను  పాటించుకున్నట్లితే మేలైన విత్తన దిగుబడి అదే విధంగా ఏపుగా పెరిగిన పశుగ్రాసం పొందవచ్చును. రైతులు వ్యయాన్ని తగ్గించి నికర ఆదాయం పొందవచ్చు. ఇక రసాయనిక ఎరువుల విషయానికొస్తే  8  కిలోల నత్రజని , 16 కిలోల భాస్వరం వేసుకోవాలి. 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆఖరి దుక్కిలో వేయాలి.

నీటి యాజమాన్యం :- ప్రస్తుత పరిస్థితులలో అవసరము లేకున్నా కీలక దశలైన మొగ్గ ,పిందే కాయ తయారగు దశలో నీరు అందించాలి. దరిదాపుగా పంటనీ మిగులు తేమ ఆధారంగా పండిస్తారు. ఒకవేళ బెట్ట పరిస్థితులు నెలకొన్నచో  2 శాతం యూ . లేదా 2 % డి.ఎ.పి ద్రావణం పిచికారి చేసినట్లైతే ఉపయోగకరంగా వుంటుంది.

అలసంద పంటని అంతర పంటగా వేసుకున్నట్లయితే నికర ఆదాయం వస్తుంది. అదే విధంగా పశు పోషణకే బహు చక్కగా ఉపయోగపడుతుంది.వేరు శనగ , కంది ,పెసర ,మినుము,నువ్వుల పంటతో అంతర పంటగా సాగు చేయవచ్చు. సమగ్ర సస్య రక్షణ చర్యలు రసం పీల్చే పురుగులకే ఎప్పటికప్పుడు చేస్తుండాలి. అలసందలో తెగుళ్ళు సమస్యలు కూడా ఎక్కువే కావున పలు నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పంట కోత :- అలసందలు  కొన్ని బొబ్బెర్లు అని కూడా పిలుస్తారు. దీనిని పచ్చి కాయలకు మరియు విత్తనం కోసం పండిస్తుంటారు. పచ్చి కాయల కోసమా పండించినప్పుడు 45  రోజుల నుండి కాయలు కోతకు సిద్దంగా ఉంటాయి. ప్రతి రెండు మూడు రోజులకే  కోయవచ్చును.దీని వలన మార్కెటింగ్ కి అనుకూలంగా ఉంటుంది. సుమారు 30 – 40 క్వింటాళ్ళు ఎకరానికి పచ్చి కాయల దిగుబడి నిస్తుంది.

విత్తనంగా  పండించినప్పుడు రకం యొక్క కాలాన్ని బట్టి  80 – 100 రోజులకు కాయలు తయారుగును. ఆకు పచ్చని రంగు నుండి పసుపు రంగుకు క్రమేపి ఎండు గడ్డి రంగుకు మారి ఎండిపోవును. ఆకులు కూడా క్రమేపి ఎండి పోయి రాలిపోతాయి.

డా . యస్ .మధుసూదన్ రెడ్డి ,డా .కె . గోపాల కృష్ణ మూర్తి ,డా . వి .వెంకన్న డా .యం . రాం ప్రసాద్

వ్యవసాయ కళాశాల , అశ్వారావు పేట

 

Also Read : పసుపులో వచ్చే తెగుళ్లు మరియు నివారణ చర్యలు

Leave Your Comments

తెలంగాలో కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి పర్యటన..

Previous article

బోర్ల కింద వరి వద్దు…

Next article

You may also like