వార్తలు

ఐదవ అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్ర కాంగ్రెస్ సదస్సు

0
Fifth International Agronomy Congress

Fifth International Agronomy Congress

Fifth International Agronomy Congress

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రానమి సంయుక్తంగా నిర్వహిస్తోన్న 5వ అంతర్జాతీయ అగ్రానమి కాంగ్రెస్ రాజేంద్రనగర్‌లోని బిజెపీఎస్ఎయు ఆడిటోరియంలో ఈ ఉదయం ప్రారంభమైంది. సుమారు 500 మంది ఆన్లైన్లోను, 800 మంది ఆన్లైన్లోనూ దీనిలో పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీ వరకూ ఇది జరగనుంది.

Fifth International Agronomy Congress

తొలుత పికెటిఎస్ఎయు ఉపకులపతి, ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రానమి ప్రెసిడెంట్ డాక్టర్ వి.ప్రవీణ్ రావు స్వాగతోపన్యాసం చేశారు. ఏర్పాటైన 7 ఏళ్లలో యూనివర్సిటీ అనేక మైలురాళ్లని సాధించిందని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి సమ యంలో ఎవరికి ఆహార కొరత లేకుండా చూడటంలో భారతదేశం తన సమర్థత చూపిందన్నారు. భారతదేశంలో ప్రస్తుతం ఆహారధాన్యాల ఉత్పత్తి ఆరు రెట్లు, హార్టికల్చర్ ఉత్పత్తి 10 రెట్లు అధికం అయ్యిందన్నారు. ప్రస్తుతం వ్యవసాయరంగం, నీటి సమర్థ యాజమాన్యం, భూసార పరిరక్షణ, వాతావరణ పరిరక్షణ అంశాల్లో సవాళ్లు ఎదుర్కొంటున్నదని ప్రవీణ్ రావు అభిప్రాయ పడ్డారు. Fifth International Agronomy Congress

Fifth International Agronomy Congress

ఒకప్పుడు ఉమ్మడి వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థి, ప్రవీణరావు శిష్యుడైన తాను ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించడం అదృష్టం అని క్రాప్ సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా ప్రెసి డెంట్ ప్రొఫెసర్ పివి. వరప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. ఆహార అభద్రత, పర్యావరణ అభద్రత, మహిళలు, శిశువుల్లో పౌష్టికాహారలోపం తదితరాలు నేడు ప్రధాన సవాళ్లని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి సమయంలో సమాజంలోని అసమానతలు బహిర్గతం అయ్యాయన్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభా బాగా అధికం అవుతుందని… అందుకోసం అదనంగా 60 శాతం ఆహారధాన్యాల ఉత్పత్తి పెరగాలని ఆయన సూచించారు. అందుబాటులో ఉన్న భూవనరుల్లోనే ఈ అధిక ఉత్పత్తి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా 30 శాతం ఆహార ఉత్పత్తులు వృధా అవుతున్నాయని.. దీన్ని అరికట్టవలసి ఉందన్నారు. అధు నాతన టెక్నాలజీలని పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. దేశంలో 50 శాతం మెట్ట వ్యవసాయమే సాగవుతుందని ఇంటర్నేషనల్ వీడ్ సైన్స్ సొసైటీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ సముందర్ సింగ్ అన్నారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెరగడంతోపాటు రైతుల ఆర్థిక స్థితి మెరుగు పడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పురుగుమందులు, కీటక నాశినులు చల్లడంలో డ్రోన్‌ను వినియోగం పెరగాలని సముందర్ సింగ్ సూచించారు.

 

Leave Your Comments

సెంచరీ కొట్టిన టమోటా ధర….

Previous article

దేశంలో ఎరువుల కొరత లేదు…

Next article

You may also like