మన వ్యవసాయం

తడి ధాన్యంతో చిక్కులు…

0
paddy procurement terms and conditions

paddy procurement terms and conditions రైతులు హార్వెస్టర్ తో వారిని కోసి నేరుగా పంటని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తున్నారు. అయితే ఆరబెట్టకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన రైతులకు, అధికారులకు ఒకింత వాగ్వాదం చోటు చేసుకుంటుంది. పంటని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి వారం గడుస్తున్నా కొనుగోలు చెయ్యడం లేదని రైతులు వాపోతున్నారు. కాగా ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం పంట ఉంటేనే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు కొనుగోలు కేంద్రాల అధికారులు.నిజానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎఫ్‌సీఐ నిబంధనలు అమలుచేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ నష్టాన్ని కొనుగోలు కేంద్రాల నిర్వహకులు లేదా మిల్లర్లు లేదా పౌరసరఫరాలశాఖ భరించాల్సి వస్తుంది.

ఈ విషయంలో రైతులకు సంబంధిత అధికారులు రైతులకు అవగాహన కలిపిస్తున్నప్పటికీ ఈ సమస్య ఎదురవుతూనే ఉంది. ధాన్యం ఆరబోసి, తూర్పారబట్టాలని నిర్వాహకులు రైతులకి సూచిస్తున్నారు. ఇక్కడ మరో సమస్య ఏంటంటే కొనుగోలు కేంద్రాల్లో అప్పటికే ఇతరత్రా ధాన్యం ఉండటంతో అక్కడ ధాన్యాన్ని ఆరబెట్టడం సాధ్యం కానీ పరిస్థితి. నాణ్యమైనపంటకే మంచి ధర పలుకుతుండటంతో కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. paddy procurement terms and conditions

రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు, సూచనలు…

రైతులు తమ ఫోన్‌ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకున్న తర్వాతే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించే సమయంలో ఓటీపీ కోసం ఫోన్‌ను రైతు వద్దే ఉంచుకోవాలి. ఓటీపీ వచ్చిన తర్వాతే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌ పుస్తకం, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం కచ్చితంగా ఉండాలి. ఎవరి పేరుపై పట్టాదార్‌ పాస్‌ పుస్తకం ఉంటుందో ఆ రైతే కొనుగోలు కేంద్రానికి రావాలి. ఆ రైతుకు సంబంధించిన బ్యాంక్‌ పాస్‌ పుస్తకం ఇవ్వాలి. ఒక రైతు ధాన్యాన్ని మరో రైతు పేరుపై నమోదు చేయరు. మద్దతు ధర గ్రేడ్‌ ఏ రకానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940గా నిర్ణయించారు. రైతులు ఏమైనా సమస్యలుంటే 1967, 1800-42500333 నంబర్లకు ఫోన్‌ చేసి, ఫిర్యాదుచేయొచ్చు. Telangana paddy procurement

Leave Your Comments

పార్లమెంట్ సమావేశాలకు ముందు రెండు రోజుల సమ్మె…

Previous article

ఉప్పుడు బియ్యాన్ని కొనే ప్రసక్తే లేదు..!

Next article

You may also like