మన వ్యవసాయం

సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం !

0
Awareness On Organic Farming
Awareness On Organic Farming

Awareness On Organic Farming ఆరోగ్యంపై శ్రద్ధ, వ్యవసాయంపై మక్కువ పెరగడంతో సాగులో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై ఫోకస్ చేస్తున్నారు రైతులు. రసాయన సాగులో భూమి నిస్సారం అవ్వడం, ఏటేటా దిగుబడులు కూడా తగ్గిపోతున్నాయి. అంతేకాదు.. పంట ఉత్పత్తుల్లో క్రిమినాశిని అవశేషాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మేరకు రైతులు రూటు మర్చి సేంద్రియ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారు. సేంద్రియ సాగుతో మంచి దిగుబడి, ఆహారంలో స్వచ్ఛత, ఉత్పత్తులకు క్రమేపీ డిమాండ్‌ పెరుగుతుండడంతో రైతన్నలు సేంద్రియంపై ఆసక్తి కనబరుస్తున్నారు.

Organic Farming

Organic Farming

Awareness On Organic Farming సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. గ్రామాల్లో, మండలాల్లో రైతు సదస్సులు నిర్వహించి సేంద్రియ పంట లాభాలు, రసాయనిక ఎరువుల వల్ల కలిగే అనర్ధాలపై రైతులకు వివరిస్తున్నారు అధికారులు. తాజాగా మధిరలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం విద్యార్థులకు తొర్లపాడు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో వరి సాగుపై అవగాహన కల్పించారు. వరిసాగు చేసే విధానాలను గురించి విద్యార్థులకు వివరించారు.

Awareness On Organic Farming

Awareness On Organic Farming

ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు, డాక్టర్ కే.నాగజ్యోతి, డాక్టర్ జీ.వేణుగోపాల్ సేంద్రియ పద్ధతి విత్తనం ఎంపిక, సాగు విధానం, బీజామృతం, జీవామృతం, గణజీవామృతం, అమృతద్రావణం, జీవన ఎరువుల తయారీపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతు సురేందర్‌రెడ్డి, దేశవాళీ గోసంరక్షకుడు మురళీకృష్ణప్రసాద్ పాల్గొన్నారు.

Leave Your Comments

యాసంగి మొక్కజొన్న సాగుకు – సూచనలు

Previous article

వేరు పురుగు చేయు చెరకు ఇంత ఇంత కాదయ్యా ….

Next article

You may also like