farm laws (Rakesh Tikait) రాజు ఎంతటివాడైన న్యాయానికి కట్టుబడి ఉండాల్సిందే. భారతదేశంలో నిన్న అదే జరిగింది. ఏడాది కాలంగా రైతులు చేస్తున్న అలుపెరగని పోరాటానికి కేంద్రం మెడలు వంచక తప్పలేదు. మూడు వ్యవసాయ చట్టాల రూపకల్పనపై రైతుల ఉద్యమం తారాస్థాయికి తీసుకెళ్లారు. ఏడాది పాటు అన్ని వదులుకుని న్యాయమే ధ్వేయంగా ముందుకు సాగారు. మొత్తానికి నిన్న నవంబర్ 19న మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోడీ చారిత్రాత్మక ప్రకటన చేశారు. దీంతో దేశవ్యాప్తంగా రైతులు పండుగ చేసుకుంటున్నారు. అయితే ఈ చట్టాల రూపకల్పన ఎప్పుడు జరిగింది? ఏడాది కాలంగా రైతులు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? ప్రభుత్వాలు తీరు ఎలా ఉండేది?
2020 జూన్ 5 తేదీన కొత్త వ్యవసాయ చట్టాల రూపకల్పన జరిగింది.
2020 జూన్ 15న తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఆర్డినెన్స్ ప్రవేశపెట్టింది.
2020 సెప్టెంబర్ 14న పార్లమెంట్‌లో ఈ కొత్త వ్యవసాయ బిల్లును ప్రవేశ పెట్టింది.
2020 సెప్టెంబర్ 17న మూడు వ్యవసాయ చట్టాల బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది
2020 సెప్టెంబర్ 20న రాజ్యసభలో కూడా మూడు వ్యవసాయ చట్టాల బిల్లులకు ఆమోదం తెలిపింది
2020 సెప్టెంబర్ 27న మూడు వ్యవసాయ చట్టాలను రాష్ట్రపతి ఆమోదించారు.
2020 నవంబర్ 26న వ్యవసాయ చట్టాలపై పంజాబ్, హర్యానా రైతుల ఉద్యమం మొదలు పెట్టారు.. ఛలో ఢిల్లీ పేరిట ఆందోళన చేపట్టారు ఈ ఆందోళనలో 40 రైతు సంఘాలు పాల్గొన్నాయి.
2020 నవంబర్ 28న రైతన్నల పోరాటంపై స్పందించింది. ఈ నేపథ్యంలో కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులను చర్చలకు ఆహ్వానించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
2020 డిసెంబర్ 3న రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య తొలి విడుత చర్చలు జరిగాయి.
2020 డిసెంబర్ 5న రైతులతో రెండోసారి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం అయ్యాయి.
2020 డిసెంబర్ 8న కేంద్ర ప్రభుత్వ వైఖరికి రైతు సంఘాలు భారత్‌బంద్ పిలుపునిచ్చారు.
2020 డిసెంబర్ 9న వ్యవసాయ చట్టాలను సవరణ చేసినప్పటికీ వాటిని రైతులు తిరస్కరించారు.
2020 డిసెంబర్ 11న కొత్త వ్యవసాయ చట్టాల రద్దుపై సుప్రీంకోర్టును రైతు సంఘాలు ఆశ్రయించాయి.
2020 డిసెంబర్ 13న వ్యవసాయ చట్టాలపై మరోసారి రైతులతో చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.
2020 డిసెంబర్ 16న వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.. సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తామని సుప్రీం తెలిపింది.
2020 డిసెంబర్ 21న వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల నిరాహార దీక్ష మొదలుపెట్టారు.
2020 డిసెంబర్ 30న రైతులతో కేంద్ర ప్రభుత్వం ఆరో విడత చర్చలు జరిపింది, ఎలక్ట్రిసిటీ అమెండ్‌మెంట్ బిల్, గడ్డి తగులబెట్టడంపై జరిమానా వంటివి తీసేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.
2021 జనవరి 4న రైతులతో ఏడోసారి కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది.. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న రైతుల వినతిని కేంద్రం తిరస్కరించింది.
2021 జనవరి 7న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణకు అంగీకారం తెలిపిన సుప్రీంకోర్టు
2021 జనవరి 11న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. చట్టాలను తీసుకొచ్చిన తీరుపై సీరియస్ అయిన సర్వోన్నత న్యాయస్థానం.
2021 జనవరి 12న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధించిన సుప్రీంకోర్టు.
2021 జనవరి 15న రైతులు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మరో దఫా చర్చలు విఫలం అయ్యాయి.
2021 జనవరి 20న మరోసారి రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు.. మూడు వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నరపాటు నిలివేసి, చట్టంపై చర్చించేందుకు ఉమ్మడి కమిటీ వేయాలని ప్రతిపాదన చేయగా.. దాన్ని కూడా రైతు సంఘాలు తిరస్కరించాయి.
2021 జనవరి 26న వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలోని ఎర్రకోట వద్ద రైతుల ఆందోళన చేశారు. కాగా అది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
2021 జనవరి 28న ఢిల్లీలోని ఘాజీపూర్ సరిహద్దులో రైతుల ఆందోళనలు మొదలు.. ఢిల్లీలోకి రైతులు రాకుండా ఘజియాబాద్ వద్ద రాత్రికి రాత్రే ఉద్యమాన్ని విరమించి వెళ్లిపోవాలని ఆర్డర్ వేసిన ప్రభుత్వం ప్రభుత్వం.
2021 ఫిబ్రవరి 5న రైతు ఉద్యమంపై సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
2021 ఫిబ్రవరి 6న చక్కా జామ్ పేరిట దేశవ్యాప్తంగా రాష్ట్ర, జాతీయ రహదారులను దిగ్భంధించిన రైతులు
2021 ఫిబ్రవరి 8న రైతులు రైలు రోకో చేపట్టారు.
2021 ఫిబ్రవరి 9న పంజాబీ నటుడు దీప్ సింధు కార్యకర్తగా మారి గణతంత్ర దినోత్సవం రోజున రైతు ఆందోళనల్లో పాల్గొన్నాడంటూ అరెస్టు చేసిన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్.. ఏడు రోజుల పాటు కస్టడీ విధించారు.
2021 ఫిబ్రవరి 18న దేశ వ్యాప్తంగా రైలు రోకోకు పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్ మోర్చా
2021 మార్చి 2న సెక్టార్ 25 నుంచి పంజాబ్ విధానసభ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్, ఇతర పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్న చండీగఢ్ పోలీసులు
2021 మార్చి 5న రైతులు, పంజాబ్ ప్రయోజనాల దృష్ట్యా వ్యవసాయ చట్టాలను భేషరతుగా ఉపసంహరించుకోవాలని తీర్మానం ఆమోదించిన పంజాబ్ విధాన సభ
2021 మార్చి 6న కొత్త వ్యవసాయ చట్టాల ఉపసంహరణ కోసం రైతులు చేపట్టిన ఉద్యమానికి వంద రోజులు పూర్తి అయింది.
2021 ఏప్రిల్ 15న ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులతో చర్చలను పునః ప్రారంభించాలని, సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని ప్రధాని మోదీకి లేఖ రాసిన హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా
2021 ఏప్రిల్ 26న దీప్ సిద్దూకి రెండోసారి బెయిల్ మంజూరు
2021 మే 21న మూడు వ్యవసాయ చట్టాలపై చర్చలను పునః ప్రారంభించాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాసిన సంయుక్త కిసాన్ మోర్చా
2021 మే 27న ఆరు నెలల ఆందోళనలకు గుర్తుగా బ్లాక్ డే పాటిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు రైతన్నలు.
2021 జూన్ 5న కొత్త వ్యవసాయ చట్టాలను ప్రకటించి ఏడాది పూర్తి.. దీనికి గుర్తుగా నిరసనలు తెలుపుతూ సంపూర్త క్రాంతికారి దివస్‌గా పాటించిన రైతులు
2021 జూన్ 26న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ఏడు నెలలకు నిరసనకు నిదర్శనంగా ఢిల్లీ మార్చ్
2021 జూలై 22న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కిసాన్ సన్సద్ ప్రారంభం.. మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంపై రైతుల చర్చలు
2021 ఆగస్టు 7న 14 ప్రతిపక్ష పార్టీల నాయకులతో పార్లమెంట్ హౌస్‌లో సమావేశం..
2021 ఆగస్టు 28న కర్నాల్ నిరసన ప్రదేశంలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్
2021 సెప్టెంబర్ 7న పెద్ద ఎత్తున కర్నాల్ ప్రదేశానికి చేరుకుని మినీ సెక్రటేరియట్‌ను ముట్టడించిన రైతులు
2021 సెప్టెంబర్ 17న మూడు వ్యవసాయ చట్టాలు ఆమోదం పొంది ఏడాది పూర్తయినందుకు నిరసనగా భారత్ బంద్ పాటించిన రైతు సంఘాలు
2021 నవంబర్ 19న వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాని మోదీ చారిత్రాత్మక ప్రకటన చెయ్యడం జరిగింది.
Also Read : సాగుచట్టాల రద్దుపై యూఎస్ స్పందన ఇది !