KTR Comments on Farm Bills: ప్రధాని నరేంద్ర మోడీ (Modi) రద్దు చేసిన వ్యవసాయ చట్టాలపై తెలంగాణ ప్రజాప్రతినిధులు వారి వారి శైలిలో స్పందించారు. మరి ఈ వ్యవసాయ చట్టాలపై ఎవరేమన్నారో ఓ లుక్కేద్దాం…
మంత్రి కేటీఆర్ ( KTR ): ఇది రైతుల విజయం. రైతుని మించిన శక్తి మరొకటి లేదు అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మంత్రి హరీష్ రావు ( Harish Rao ): రైతులను నట్టేట ముంచేలా కేంద్ర ప్రభుత్వం చేసిన నల్లవ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల విజయం. ఏడాది కాలంగా బుల్లెట్ లకు, లాఠీలకు, వాటర్ కానన్ లకు, పోలీసు కంచెలకు, నిషేధాలకు ఎదురెళ్లి విజయం సాధించిన తీరు అద్భుతం అంటూ హరీష్ అన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ ( Satyavathi Rathod ): దేశానికి అన్నం పెట్టే రైతన్న వెన్నెముకను విరగొట్టే విధంగా, వ్యవసాయాన్ని విధ్వంసం చేసే విధంగా కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలపై రైతులు అలుపెరగక చేసిన పోరాట ఫలితం, రైతు సాధించిన విజయం, రైతుబంధు కేసిఆర్ ధర్నా, రైతు మద్దతు ఉద్యమాల ఫలితం ఈ నల్ల చట్టాల రద్దు. రైతులందరికీ అభినందనలు.
గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) : రైతుల ధర్మాగ్రహానికి ఫలితమిది, యావత్ దేశ రైతాంగం ఆందోళనలకు దక్కిన ప్రతిఫలం మూడు వ్యవసాయ చట్టాల రద్దు. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పోరాట పటిమతో తెలంగాణ రైతాంగం యాసంగి పంట కేంద్రం యథాతదంగా కొనేదాక పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. జై కిసాన్.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ( Indra Karan Reddy ) : నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించింది ఇది అన్నదాతలు సాధించిన విజయం. ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు చేసిన సుధీర్ఘ పోరాటానికి కేంద్ర దిగిరాక తప్పలేదు.