ఆరోగ్యం / జీవన విధానం

అలోవెరాతో ఇంట్లోనే వైద్యం…

0
Aloe vera health benefits
Aloe vera health benefits

మనకు ప్రకృతిలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే అనేక మంచి పదార్థాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో కలబంద ఒకటి. దీన్ని అలోవెరా (Aloe vera health benefits) కూడా అంటారు. ఈ అలోవేరాకు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. ఎన్ని మొక్కల్ని పెంచినా… ఇంకా ఇంకా కావాలని అంటున్నాయి ఫార్మా, కాస్మెటిక్, బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీ కంపెనీలు. చాలా సబ్బులు, క్రీములు, లోషన్ల తయారీలో అలొవెరా వాడుతారు. అందువల్ల ఈ మొక్కలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ కలబంద మనిషి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

Aloe vera health benefits

అలోవెరా మొక్క మన చుట్టూ ఉన్న గాలిని శుభ్రం చేస్తుంది. కలబంద జ్యూస్ రోజూ పరగడుపునే దీన్ని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్లిపోతాయి. రోజూ ఉదయాన్నే కలబంద జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. కలబంద (Kalabandha) మంచి లాక్సేటివ్ గా పనిచేస్తుంది.ఇది ఆకలిని పెంచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. కలబంద తాగడం వల్ల కడుపులో ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోవడంతో పాటు ఆకలి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఎర్ర రక్తకణాలు పెరుగుదలలో దీని ప్రభావం ఉంటుంది. ఇది రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరిగేలా చేసి, రక్తహీనతను తగ్గిస్తుంది. తద్వారా మీ అలసట కూడా తగ్గుతుంది.

Aloe vera health benefits

కలబందను ముఖానికి, జుట్టుకు రాయడం చాలామందికి తెలిసిన పద్ధతే. అయితే ఇలా చేయడంతో పాటు దాన్ని తాగడం వల్ల మీ చర్మంలోని టాక్సిన్లన్నీ తొలగిపోయి మీ చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. షుగ‌ర్ వ్యాధి గ్రస్తుల‌కు క‌ల‌బంద (AloeVeraJuice) రసం దివ్యౌష‌ధంలా ప‌ని చేస్తుంది. దీనివ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. దంతాలు, చిగుళ్ల స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్న వారు క‌ల‌బంద‌ను నిత్యం తీసుకుంటే మంచి ఫలితం ల‌భిస్తుంది. కీళ్ల సమస్యలు: క‌ల‌బంద రసం తాగితే కీళ్లు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పలు త‌గ్గుతాయి. శ‌రీరానికి కావాల్సిన విట‌మిన్లు పుష్కలంగా ల‌భిస్తాయి. ఇంకా క‌ల‌బంద గాయ‌లు, పుండ్లను త‌గ్గించ‌డంలోనూ కీల‌క పాత్ర పోషిస్తాయి. గుజ్జును గాయాలపై రాస్తే త్వర‌గా తగ్గుతాయి. అయితే, దీనిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. గర్భిణీలు, తరచూ కడుపు సమస్యలతో బాధపడేవారు, విరేచనాలతో బాధపడేవారు కలబందను తినకూడదు.

#Aloeverahealthbenefits #AloeVeraUses #KalabandhaBenefits #AgricultureNews #HealthNews #Eruvaaka

 

Leave Your Comments

పొగాకు రైతులకు మంచి దిగుబడి రావాలంటే…

Previous article

ఎవరి పంట వాళ్ళు పండించుకోవాల్సిందేనా..!

Next article

You may also like