జాతీయ ఉద్యానవన బోర్డు (ఎన్. హెచ్.బి.) సంస్థ 1860 లో రిజిస్ట్రేషన్ చేయించగా 1984 లో కేంద్ర ప్రభుత్వం స్థాపించింది. ఈ సంస్థ కేంద్ర కార్యాలయం హర్యానాలోని గుర్గావ్ నగరంలో ఉంది. ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ పరిధిలోని వ్యవసాయ మరియు సహకార శాఖ మరియు ఎన్.హెచ్.బి. బోర్డు డైరెక్టర్ల మార్గదర్శకత్వంలో మేనేజింగ్ డైరక్టర్ ఈ సంస్థ యొక్క వివిధ పథకాలను అమలు చేస్తారు.
ఈ సంస్థ అమలు చేస్తున్న పధకాలు, మరియు తదితర అంశాలను చూద్దాం…
- ఉద్యానవనాల పంటల సాగు మరియు పంటకోత అనంతరం వాటి యాజమాన్య నిర్వహణ పద్ధతుల అమలు ద్వారా వాణిజ్య స్థాయిలో ఉద్యానవనాలను అభివృద్ధి చేయుట.
- ఉద్యానవన ఉత్పత్తులను నిల్వచేయడం కోసం కోల్ట్ స్టోరేజ్ ల నిర్మాణానికి, పాత కోల్డ్ స్టోరేజీలను ఆధునీకరించడానికి, నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సబ్సిడీపై మూలధనాన్ని సమకూర్చుతుంది.
- ఉద్యానవన పంటలకు సంబంధిత మార్కెట్ సమాచార సేవలు అందిస్తుంది.
- వాణిజ్య స్థాయిలో అత్యాధునిక ఉద్యానవనాల అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తించడం, గుర్తించిన ప్రాంతాలలో ఉద్యానవనాల అభివృద్ధి కార్యకలాపాలను వేగవంతం చేయడం, తద్వారా ఆ ప్రాంతాలను ఉద్యానవన అభివృద్ధి కేంద్రాలు (హబు) గా మార్చడం వంటి కార్యకలాపాలు చేస్తుంది.
- ప్రస్తుతం ఉన్న ఉద్యానవనాల కేంద్రాల కార్యకలాపాల విస్తరణ ప్రాజెక్టులో భాగంగా పంటల ఉత్పత్తి అనంతరం యాజమాన్య నిర్వహణకు అవసరమైన మౌలిక వనరులను అన్ని ఉద్యానవన ప్రాజెక్టులకు ఉపయోగపడే విధంగా కల్పిస్తుంది
- అప్పుడే ఉత్పత్తి అయిన తాజా ఉద్యానవన పంట ఉత్పత్తులను నిల్వచేయడానికి, తక్కువ ఇంధనాన్ని మాత్రమే వినియోగించుకొనే సమగ్ర కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలని అభివృద్ధి చేస్తుంది
- నూతనంగా గుర్తించిన సాంకేతిక పరికరాలను, సాంకేతిక నైపుణ్యాలను, వాణిజ్య స్థాయిలో వినియోగించుకొని పరిజ్ఞానాన్ని మదింపు చేసుకోవడానికి వీలుగా ప్రచారం చేయడం ఈ సంస్థ యొక్క కర్తవ్యం.
- ఉద్యానవన పంటల తాజా ఉత్పత్తుల అభివృద్ధికి మరియు వాటి మార్కెట్ సౌకర్యాల అభివృద్ధి కోసం ఉద్యానవన విస్తరణ కార్యకలాపాలను పెంచే చర్యలను అమలు చేస్తుంది.
- ఉద్యానవన పంటలు సాగుకు సంబంధించిన వివిధ వనరులను, పరికరాలను క్షేత్రస్థాయిలో ప్రదర్శించడానికి కృషి చేస్తుంది.
- నూతనంగా కనుగొన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, అనువర్తిత పరిశోధన మరియు అభివృద్ధి పథకాల ద్వారా వాటిని వాణిజ్య స్థాయికి తీసుకొని వెళ్తుంది
- బి. హెచ్.ఎమ్. ప్రోటోకాలకు సంబంధించిన ప్రమాణాలపై పరిశోధనను మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం, తాజా ఉద్యానవన ఉత్పత్తులను భద్రంగా నిల్వచేసుకొనే అనుకూల పరిస్థితులను సూచించడం, కోల్డ్ స్టోరేజ్ కేంద్రాల మౌలిక సౌకర్యాలను సాంకేతిక ప్రమాణాలను నిర్ణయించడం తదితర కార్యకలాపాలకు నడుచుకుంటుంది. .
- ఉద్యానవన ఉత్పత్తులను కాలయాపన లేకుండా, తాజాగా వినియోగదారులు వినియోగించుకోవడానికి తగిన చర్యలు తీసుకొంటుంది.
- ఉద్యానవన పంటల అభివృద్ధికి అవసరమైన దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యూహాలను తయారుచేయడం, ఇందుకు గల ఆటంకాలను గుర్తించడం, అవసరమైన, అధ్యయనాలను, సర్వేలను నిర్వహించడం, మరియు సాంకేతిక సేవలను, కన్సల్టెన్సీ సేవలను అందించడం వంటి వాటిలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది.
#NationalHorticultureBoard #agriculturelatestnews #SchemesofNHB #eruvaaka
Leave Your Comments