మన వ్యవసాయం

పట్టు పెంపకంతో లక్షల్లో ఆదాయం…!

0
A Comple Guide On Silkworm Farming
A Comple Guide On Silkworm Farming

వ్యవసాయమే కాకుండా ఇతర పంటలపై ద్రుష్టి పెడితే ఆదాయంతో పాటు ఆదర్శంగా కూడా ఉంటుంది. ఈ విధానాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందిస్తున్నాయి. సబ్సిడీ రూపంలో ఆదుకుంటున్నాయి. వ్యవసాయం బొత్తిగా గిట్టుబాటు కాకుండా పోతున్న ఈ రోజుల్లో కన్నీటి సేద్యం చేయడం కన్నా..కొందరు ఇతర పంటలపై మార్గాలు అన్వేషిస్తున్నారు. అందులో ప్రముఖంగా పట్టు సాగుపై కొందరు ద్రుష్టి పెట్టడం అభినందనీయం.

పట్టు పురుగుల పెంపకానికి చాలా తక్కువ పెట్టుబడి అవుతుందని సాగు చేస్తున్న కొందరు రైతులు చెప్తున్న మాట. అధిక ఆదాయం పొందవచ్చంటున్నారు. ఒకసారి పట్టు పురుగుల పెంపకం, మరియు దాని విధివిధానాలు చూద్దాం .. పట్టు పురుగుల పెంపకం 21 రోజుల ప్రక్రియ. ఈ పంట మొత్తం ఐదు దశల్లో ఉంటుంది. రెండు దశలు చాకీ సెంటర్లలో పూర్తి కాగా, రైతువద్ద మూడు దశలు పూర్తి చేసుకుంటుంది. చాకీ కేంద్రాల్లో పట్టు పురుగుల గుడ్లను పొదిగిన తర్వాత ఎనిమిది రోజులు అక్కడే ఉంచుకొని, తొమ్మిదో రోజున పురుగులను రైతుకు సరఫరా చేస్తారు. అప్పటినుంచి 21వ రోజు వరకూ వీటిని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. పట్టు పురుగులకు 14 రోజులు ఆకులు వేస్తే పురుగులు పట్టుకాయలుగా మారుతాయి.

ఇక ఈ పంటకు సీజన్ అంటూ ఏమీ లేదంటున్నారు. ఏడాది పొడవునా ఈ పంటను వేసుకోవచ్చని వారి సూచన. కనిష్ఠంగా 10 నెలలపాటు సాగు చేయవచ్చు. అయితే ఈ పంటలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే… వేసవి కాలంలో ఈ సాగుపై ద్రుష్టి పెట్టాలి. వేసవిలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఆ రెండు నెలలూ పట్టు పురుగులను పెంచుకోవచ్చు. ఇలా, ఏటా కనీసం ఏడునుంచి పది పంటలు తీసే అవకాశం ఉంటుంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లోని మరే వ్యాపారానికీ ఈ వెసులుబాటు ఉండదు. అదే విధంగా, పట్టు పురుగులకు కావాల్సిన మల్బరీ ఆకుకూడా ఏడాదంతా లభిస్తుంది. ఈ మొక్కలను ఒక్కసారి నాటితే సుమారు 15 ఏండ్లపాటు పంటను ఇస్తూనే ఉంటాయి. దీంతో ప్రతిసారీ కొత్తగా మొక్కలు నాటుకోవాల్సిన అవసరం ఉండదు.

పురుగులు కుబుసం విడిచినప్పుడు, రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారి నుంచి కాపాడేందుకు ఫార్మనిక్ పౌడర్ చల్లాలి. విసర్జకాల నుంచి వైరస్ రాకుండా పొడి వాతావరణం కోసం కాల్చిన సున్నం చల్లాలి. పట్టు పురుగులను ప్రతి పూటా నిశితంగా పరిశీలించటం, అంటురోగాలు వ్యాప్తి చెందకుండా షెడ్‌ను రసాయనాలతో కడగటం ద్వారా 90 శాతం నష్టాలను నివారించవచ్చునని చెపుతున్నారు. రోజూ స్వయంగా మేత కోసి వేస్తూ, పట్టు పురుగులను పరిరక్షిస్తూ, సకాలంలో చర్యలు తీసుకోవటంతో పెద్ద ఇబ్బందులేమీ ఉండవు.

ఈ సాగుకు ప్రభుత్వాలు ఎంతో ప్రోత్సహకం అందిస్తున్నాయి. పట్టు పురుగుల పెంపకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ సబ్సిడీలను అందిస్తున్నాయి. 1250 చ.అ. షెడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షలు సబ్సిడీ అందిస్తుంది. . ఉపాధి హామీ పథకంలో భాగంగా మెటీరియల్‌ ఖర్చుకింద మరో రూ.1.35 లక్షల వరకూ అందిస్తున్నది. ఎస్సీ రైతులకు ప్రత్యేకంగా మరో రూ. లక్ష వరకూ సబ్సిడీ లభిస్తుంది. ఇవే కాకుండా తెలంగాణ ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో డ్రిప్‌ను అందిస్తుంది. రైతు పెట్టిన ఖర్చులో సగం వరకూ సబ్సిడీల రూపంలోనే తిరిగి వస్తుంది. పట్టుగూళ్లకు మద్దతు ధర లేకపోవడంతో మార్కెట్‌ ధరతో సంబంధం లేకుండా ప్రభుత్వమే అదనంగా ప్రోత్సాహకం అందిస్తున్నది.


అయితే ఇతర పంటలతో పోలిస్తే ఈ సాగులో అధిక ఆదాయం ఉంటుంది. 100 గుడ్లతో సరాసరి 70 కేజీల పట్టు ఉత్పత్తి అవుతుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే 90నుంచి 100 కేజీలదాకా ఉత్పత్తి చేయవచ్చు అని చెప్తున్నారు నిపుణులు. మొత్తంగా మనకు తెలిసిన పంటలను వేస్తూ ఇతర పంటలపై కూడా ద్రుష్టి సారిస్తే నష్టాలు లేని, లక్షల్లో ఆదాయం సొంతం అవుతుంది.

#SilkwormFarming #SilkCultivation #FarmingOfSilk #Benefitsofsilk #silkfarmingbenefits #agriculturelatest #eruvaaka

Leave Your Comments

కాప్సికం పంట సాగు చేసే పద్ధతులు…

Previous article

జాతీయ ఉద్యానవనాల బోర్డు ఆవశ్యకత…

Next article

You may also like