వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అందుకోసం ఎన్నో ప్రోత్సహకాలు అందిస్తున్నాయి. వ్యవసాయం పెట్టుబడుల దగ్గర నుండి పంట కొనుగోలు వరకు ప్రభుత్వాలు రైతుల్ని ప్రోత్సహిస్తున్నాయి. నేడు వ్యవసాయ & రైతుల సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నాగాలాండ్‌లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ లో శిక్షణ పొందిన యువ స్టార్టప్‌లచే తయారు చేయబడిన 7 రకాల పులియబెట్టిన పండ్ల పానీయాలు, మిఠాయిలను ప్రారంభించారు. యువ స్టార్టప్ లతో మాట్లాడి వారిని అభినందించారు. అదేవిధంగా నాగాలాండ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ నిర్వహించిన రైతుల హాస్టల్ సమ్మిట్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే పాల్గొన్నారు.
#NarendraSinghTomar #fermentedfruitbeverages #agriculturelatestnews #eruvaaka