వ్యవసాయానికి ప్రభుత్వాలు మరింత అండగా ఉండాల్సిన అవసరం ఉంది. పెరుగుతున్న రేట్లు తగ్గుతున్న దిగుబడి ఇదంతా సామాన్య వ్యవసాయ రైతులపై భారంగా మారుతుంది. ఇందుకు రైతుల నుంచి అసహనం వ్యక్తమవుతోంది. అందులో భాగంగా ప్రభుత్వాల నుంచి సాయంపై రైతులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో 50 శాతం రైతులకి వాటాతో అన్ని పంట కార్మిక పనులతో అనుసంధానం చేయమని కోరుతున్నారు.అందుకు మోడీ ట్విట్టర్, ఈ మెయిల్ కి తమ సమస్యలను విన్నవించుకోవాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. అందుకు ఈమెయిల్ @mygov.nic.in , ట్విట్టర్ – @PMOIndia, @narendramodi కు పంపాలని నిశ్చయించారు. ప్రతి సోమవారం ప్రధానికి మోడీకి 10 వారాల పాటు సమస్యలను మోడీకి వినిపించేలా గళం ఎత్తాలని డిసైడ్ అయ్యారు. సమాచారంలో వారి పేరు మరియు మొబైల్ నంబర్ చేర్చాలి.
#Agricultural #MGNREGA #modi #eruvaaka