వార్తలు

గత్యంతరం లేకే అక్కడ గంజాయి సాగు..

0
afghanistan farmers cannabis cultivation
afghanistan farmers cannabis cultivation

గంజాయి… ఇప్పుడీ పేరు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో గంజాయి అనేది నిషేధం. కానీ అధికారుల కళ్లుగప్పి కొందరు గంజాయి సాగు చేసి లక్షల్లో సంపాదిస్తున్నారు. కానీ ఆ రైతులు మాత్రం డబ్బు కోసం కాకుండా కుటుంబ పోషణ కోసమే గంజాయి సాగు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆఫ్గనిస్తాన్‌ దేశం అనేదానికంటే తాలిబన్ల దేశంగా పిలవడమే ఉత్తమం. ఎందుకంటే ఆ దేశంలో ప్రజాస్వామ్యం లేదు అంత తాలిబన్లు అనే ఒక వర్గం చేతిలోకి వెళ్ళిపోయింది. ఇకపోతే ఆ దేశంలో రైతులు గంజాయి సాగు చేస్తున్నారు. తాలిబన్ల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అక్కడి రైతులు యథేచ్చగా గంజాయికి ప్రాణం పోస్తున్నారు. నిజానికి మాదకద్రవ్యాల్లో కలిపే ఓపియం సాగు అక్కడ చాలా ఫెమస్. అక్కడి రైతులకు ఓపియం ప్రధాన ఆదాయ వనరు. ఓపియం అంటే నల్లమందు మొక్కల నుంచి తీసిన పదార్ధాలను హెరాయిన్ సహా అనేక మత్తు పదార్ధాలలో వినియోగిస్తారు. ఓపియం పండించడంలో అఫ్గానిస్తాన్‌ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. కాగా..తాలిబన్ పాలనలో ఆర్థిక వ్యవస్థ చితికిపోవడం, ఆహార సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో… అనివార్య పరిస్థితుల్లో తాము ఈ పంట‌ల‌ను కొనసాగించక తప్పట్లేదని రైతులు వాపోతున్నారు.

ఆఫ్గనిస్తాన్‌కు చెందిన రైతు అబా వలీ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తమ పరిస్థితి గురించి వివరించారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఓపియం సాగుచేస్తున్నామని అన్నారు. ఈ పంట‌ సాగుతోనే మాకు తిండి దొరుకుతోంది. మాకు ఏ ప్రభుత్వం సాయం చేయలేదు. వేరే పంటలు పండించేందుకు అవసరమైన నీటి సదుపాయం ఇక్కడ లేదు. కాబట్టి ఓపియం సాగు మాత్రమే మా ముందున్న ఏకైక ఆప్షన్ వలీ చెప్పారు.

#afghanistanfarmers #cannabiscultivation #talibanwarnings #agriculturenews #eruvaaka

Leave Your Comments

ఆక్వా హబ్ తో మత్స్య పరిశ్రమ అభివృద్ధి..

Previous article

కోకో పంటలో అద్భుత లాభాలు…

Next article

You may also like