ఆక్వా హబ్… మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని పెంచి ప్రజలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోన్న బృహత్తర పథకమే ఆక్వా హబ్‌లు. విస్తృత స్థాయిలో చేపలు, రొయ్యల పెంపకంపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారిస్తోంది. కూరగాయలు, చికెన్ మాదిరిగా అన్ని వేళల్లో అన్ని రకాల మత్స్య ఉత్పత్తులు తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ హబ్ లు సిద్ధమవుతున్నాయి. ఉత్పత్తులను చేరవేసే లక్ష్యంతో ఫిష్ వెండింగ్, ఫుడ్ కోర్టులు కూడా అందుబాటు లోకి రానున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ వాహనాలను వినియోగించనున్నారు. అందులో భాగంగా త్వరలో 600 వాహనాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది ఏపీ ప్రభుత్వం. అయితే అందులో 200 ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇవన్నీ ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్నాయి. ఈ పథకానికి దాదాపుగా 100 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం.
తొలి దశలో విశాఖపట్నం, ప్రకాశం జిల్లా అమరావతి ప్రాంతాలకు కొన్ని వాహనాలు మంజూరు చేశారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేనివిధంగా ఆంధ్ర ప్రదేశ్ కు 975 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. దీంతో మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం సుమారు వంద కోట్లతో ప్రణాళికి రూపొందించింది.
మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ మినహా అన్ని యూనిట్లకు ప్రభుత్వం రాయితీ అందించనుంది. బీసీ జనరల్ 40 శాతం, ఎస్సి ,ఎస్టీ బిసి మహిళలకు 60శాతం పెట్టుబడుల రాయితీ కల్పించనుంది ప్రభుత్వం. మిగతా మొత్తాన్ని బ్యాంక్ ద్వారా ఋణం పొందే అవకాశం కల్పిస్తుంది సర్కార్. ఆసక్తి ఉన్నవారు వాల్యూ యాడెడ్ యూనిట్లని నెలకొల్పుకునే రిటైల్ దుకాణాలు లేదా ఆన్లైన్ లోను అమ్మకాలు చేయవచ్చు. ఈ పథకం ద్వారా ఉపాథి అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
#APGovernment #AquaHubs #Fisheriesindustry #600vehiles #600Vehicles #agriculture #eruvaaka