టీ.. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందింది. ఉదయం లేవగానే ఓ కప్పు టీ పడితేనే మంచం మించి కిందకు దిగని వాళ్ళు ఎంత మందో. సమయానికి టీ లేకపోతే శరీరంలో మార్పులు, తలనొప్పులు వస్తుంటాయి. మరి అలాంటి టీ.. ని ఇష్టపడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఇంట్లో పండు ముసలి నుంచి ఆఫీస్ లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి టీ కావాల్సిందే. అయితే టీ అంటే అస్సాం టీ గురించి మాట్లాడుకోవాలి.
కొన్ని ఏళ్ళ క్రితం టి కి రంగు రుచి ఉండేది. కానీ ఇప్పుడున్న యాంత్రిక జీవనంలో అన్ని కలుషుతమైపోతున్నాయి. మనం రోజు ఉదయాన్నే తాగే టీ కూడా దాని రంగు రుచిని కోల్పోతుంది. ముఖ్యంగా అస్సాంలో ఈ పరిస్థితి కనిపిస్తుంది. విపరీతమైన ఎండల దెబ్బ, వానలు సరిగా పండకపోవడంతో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా అస్సాంలో జనవరి నుంచి సెప్టెంబరు మధ్య సుమారు 1,857 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ ఇప్పుడు 1,188 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదవుతోంది. అలాగే 28.9 డిగ్రీలుగా ఉండాల్సిన సగటు ఉష్ణోగ్రత 1.4 డిగ్రీలు పెరిగి 30.3 డిగ్రీలుగా నమోదవుతోంది. అస్సాంలో పర్యావరణమార్పుల ప్రభావం టీ తోటల మీద బాగా కనిపిస్తోంది.
అస్సాం టీ తోటల్లో వందల మంది మహిళలు పని చేస్తుంటారు. పర్యావరణ మార్పులు వీరిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. పెరుగుతున్న వేడి, తగ్గుతున్న వానల వల్ల తేయాకు ఉత్పత్తి తగ్గి తమ బతుకులు దెబ్బతింటాయేమోనని భయపడుతున్నారు. రేపు ఏమవుతుందో తెలియని అనిశ్చితి మధ్యే వీళ్లు నిత్యం జీవితాలను గడపాల్సి ఉంటుంది. ఇదంతా పర్యావరణం సరిగా లేకపోవడమే అంటున్నారు కొందరు. పడాల్సిన సమయంలో వర్షపాతం పడట్లేదు, ఎండలు అధిక శాతంలో ఉండటంతో ఈ మార్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పర్యావరణాన్ని కాపాడటానికి ప్రభుత్వాలు మాత్రమే పని చేస్తే సరిపోదు మనలో కూడా ఒకింత మార్పు మొదలవ్వాలి అప్పుడే మానవాళి కొనసాగుతుంది.
#assamtea #assamteaflavor #agriculturenews #eruvaaka