ప్రతి ఒక్కరు విలాసవంతమైన జీవితాన్ని కోరుకోవడం సహజం. కానీ అది కొందరికే సాధ్యపడుతుంది. ఒకప్పుడు ధనికులు మట్టి కనిపించకుండా భవనాలు నిర్మించుకునే వారు. కానీ ఇప్పుడున్న కాలంలో ధనికులే ఎక్కువగా పర్యావరణానికి దెగ్గరగా ఉంటున్నారు. ఇంటి చుట్టూ అయితే చెట్లు పెంచవచ్చు కానీ ఇంటి బయట మాత్రం అందరు కాంక్రీట్ లేదా ఏదైనా రాతితో అలంకరించుకునే వారు. కానీ ఇప్పటితరం ఇంటి బయట ఉన్న ఖాళి స్థలంలో కూడా గడ్డిని పెంచేస్తున్నారు. నేలంతా పరుచుకొన్న పచ్చని గడ్డిని చూసి ఎంతో సంతోపడుతున్నారు. ఇంతకీ ఆ గడ్డి ఎలా వస్తుంది?
ఇంటిముందు కనిపెంచే పచ్చని పైరు అంటే గడ్డిని సెపెరేటుగా పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న సాగు ఇది. ఈ కార్పెట్ గడ్దని పెంచేందుకు అయ్యే ఖర్చు తక్కువే కానీ ఎక్కువ లాభాలు పొందవచ్చు. ముందుగా పొలాన్ని చదును చేసి కలియదున్నాలి. ఆ తర్వాత భూమిఅంతా తడిసేలా నీళ్లు పెట్టి, మరోసారి దున్నాలి. ఆ తర్వాత భూమి మొత్తం సమానంగా ఉండేలా చూసుకోవాలి. గడ్డిని విత్తడానికి ముందే పశువుల పేడను ఎరువుగా వేయాలి. తర్వాత గ్రోమోర్, డీఏపీ లాంటి రసాయన ఎరువులను వేసుకోవాలి. ఆపైన కొరియన్ గ్రాస్ మొక్కలను బాగా కడిగి, నాటు మాదిరిగా వేసుకోవాలి. ఈ పంట సాగుకు నీటి అవసరం కూడా ఎక్కువ ఉండదు. చలికాలం, వర్షా కాలంలో వారానికి రెండుసార్లు నీళ్లు పడితే చాలు. ఎండాకాలంలోనైతే రెండురోజులు ఒకసారి నీళ్లు పట్టాల్సి ఉంటుంది. రైతులకు చీడపీడల బెడద కూడా ఉండదు.
ఈ కార్పెట్ గడ్డిని భవనాల చుట్టూ, పచ్చిక మైదానాల్లో, ఇళ్లు, కార్యాలయాలు తదితర చోట్ల విరివిగా వాడుతున్నారు. ఈ గడ్డితో పచ్చదనంతోపాటు అందం కూడా చేకూరడంతో ఇటీవల కాలంలో కార్పెట్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఎకరా విస్తీర్ణంలో కార్పెట్ గడ్డిని సాగు చేయడానికి రూ. 80 వేల వరకు ఖర్చు వస్తుంది. కార్పెట్ గడ్డిని ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు పెంచి కట్ చేస్తారు. రెండు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పుతో బిల్లల మాదిరిగా చేస్తారు. ఒక్కో బిల్ల నాణ్యతను బట్టి రూ.9 నుంచి రూ. 12 వరకు పలుకుతుంది. ఎకరానికి సుమా రు 17,500 బిల్లలు వస్తే, వాటిని విక్రయించగా రూ. 1.50 లక్షల ఆదా యం వస్తుంది. ఖర్చులు పోనూ రైతుకు ఎకరాపై రూ. 60 వే ల నుంచి రూ. 70 వేల వరకు లాభాలు రావచ్చు. పచ్చదనాన్ని సృష్టించడం ఇప్పుడు, క్షణాల్లో పని. చాపలా పరిచేయవచ్చు
సో చూశారుగా మనసుంటే మార్గముంటుంది. అందరూ ఒకే పంట వేయాలని లేదు. మనలో మార్పు మొదలైతే చేయడానికి ఎన్నో రకాల సాగు అందుబాటులో ఉంది. గడ్డిని పెంచి లక్షలు సంపాదిస్తున్నారు కొందరు. ఈ సాగులో నష్టం అనేది ఉండదు. అయితే ఈ కార్పెట్ గ్రాస్ సాగు చేసుకునే ముందు మన చుట్టూ పరిస్థితులను చూసుకోవాలి. ఎవరికీ అవసరం ఉంటుంది, ఇల్లు, కార్యాలయాల మనకి అందుబాటులో ఉన్నాయా లేదా చూసుకోవాలి.
#CarpetGrass #greengrasscarpet #grasscarpet #agriculturelatestnews #eruvaaka #Farmers