వార్తలు

ఫుడ్ ప్రాసెసింగ్ లో పెట్టుబడులు ఎంత వరకు లాభం….

0
Benefits Of Food Processing Policy
Benefits Of Food Processing Policy

ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. భారతదేశంలో ఆహార ప్రాసెసింగ్ రంగంలో 25,00,000 పైగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి, వాటిలో 66% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి మరియు 80% పైగా కుటుంబ ఆధారిత వ్యాపారాలు గ్రామీణ వర్గాలకు ఆదాయ వనరుగా ఉన్నాయి. అయినప్పటికీ, ఈ అసంఘటిత ప్రాసెసింగ్ యూనిట్లు సంస్థాగత ఫైనాన్స్ లేకపోవడం, ఆధునిక పరికరాలు మరియు సాంకేతికత, మరియు బ్రాండింగ్ ,మార్కెటింగ్ నైపుణ్యం వంటి ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ సవాళ్లను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో పెట్టుబడులను పెంచడానికి అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. అదనంగా, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలలో ఆటోమేటిక్ రూట్‌లో 100% ఎఫ్‌డిఐని ప్రభుత్వం అనుమతించింది,

ఈ స్కీమ్ ముఖ్యంగా నిరుద్యోగులకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఈ ఫుడ్ ప్రోసెసింగ్ పథకం అన్ని విధాలుగా దోహదపడనుండి. ఈ రంగంలోకి అడుగు పెట్టాలన్న ఆలోచనతో ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక అండదండలను ఈ స్కీమ్ ద్వారా అందిస్తుంది. ఫుడ్ ప్యాకేజింగ్, పానీయాల తయారీ తదితర మైక్రో పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడుతుంది. పరిశమ్రల ఏర్పాటుతోపాటు, అందుకు అవసరమైన గోడౌన్లు , కోల్డ్ స్టోరేజ్ , ప్యాకింగ్ యూనిట్లు, ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుకోసం మౌళిక సదుపాయాల కల్పనకు 35శాతం క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ అందిచనున్నారు.

అదేవిధంగా ధాన్యం, పంటల దిగుబడి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో… ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. తెలంగాణాలో ఈ రంగంలో సుమారు పాతిక వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి, 70 వేల మందికి ప్రత్యక్ష, మూడు లక్షల మందికి పరోక్ష ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం పది ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని, 500 ఎకరాలకు తగ్గకుండా వెయ్యి ఎకరాల వరకు 2024 -2025 సంవత్సరం వరకు రాష్ట్రవ్యాప్తంగా పదివేల ఎకరాల్లో ఏర్పాటు లక్ష్యంతో ఉన్నారు. విదేశాలకు నాణ్యమైన ఎగుమతులు చేసే స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తారు. జోన్లకు అవసరమైన భూమిని ప్రభుత్వమే సేకరించి, మౌలిక వసతులను అభివృద్ధి చేసి కేటాయిస్తుంది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ప్లగ్‌ అండ్‌ ప్లే పద్ధతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది.

#FoodProcessingPolicy #AgricultureLatestNews #FoodProcessingZones #eruvaaka

Leave Your Comments

రైతు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది – రేవంత్ రెడ్డి

Previous article

పశుపోషణ మరియు పాడి పరిశ్రమలో లాభాలెన్నో…

Next article

You may also like